ఖాళీ మైదానాల్లో ప్రేక్షకులు లేకుండా క్రీడలు నిర్వహించడం క్రీడా నిర్వాహకులకి సవాలుగా మారింది. ఈ పరిస్థితిని మార్చడం ఎలా?

స్టేడియం స్టాండ్స్‌లో సెక్స్ డాల్స్‌ని నిలిపినందుకు క్రీడాభిమానుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవడంతో దక్షిణ కొరియాకి చెందిన ఎఫ్‌సి సియోల్ క్లబ్ క్షమాపణ చెప్పింది.

ఎఫ్‌సి సియోల్ క్లబ్ పాటించిన విధానాన్ని అనుసరించాలని ఇతర నిర్వాహకులు అనుకోవటం లేదు.
స్టేడియంలో స్టాండ్స్‌లో ఖరీదైన షోకేస్ బొమ్మలని పెట్టాము కానీ, అవి సెక్స్ డాల్స్ కాదని ఎఫ్‌సి సియోల్ ఫుట్ బాల్ క్లబ్ చెబుతోంది. అయితే ఆ బొమ్మలని సెక్స్ టాయ్స్‌ని తయారు చేసే ఒక సంస్థ సరఫరా చేసింది.

దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీని బహిష్కరించినప్పటికీ, కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్‌లని ప్రచారం చేస్తున్నట్లుగా కొన్ని గుర్తులు ఉన్నాయి.
బొమ్మల తయారీదారులు ఎఫ్‌సి సియోల్‌కి తమ క్షమాపణ చెప్పినట్లు బీబీసీకి చెప్పారు.

అయితే, స్టాండ్స్‌లో పెట్టిన బొమ్మలు కేవలం అత్యుత్తమ ప్రమాణాలతో తయారు చేసిన బొమ్మలు మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది.
మ్యాచ్‌లో ఏమి జరిగింది?
ఎఫ్‌సి సియోల్ ఆదివారం కె లీగ్ సీజన్ తొలి మ్యాచ్‌ని ఆడింది.

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఆట చూడటానికి ప్రేక్షకులకి అనుమతి లేకపోవడంతో మైదానం ఖాళీగా ఉంది.
ఆట ప్రారంభమవ్వడానికి ముందు కొన్ని సీట్లని షోకేస్ బొమ్మలతో నింపుతామని డాల్కం అనే సంస్థ ముందుకి రావడంతో ఎఫ్‌సి సియోల్ క్లబ్ అందుకు అంగీకరించింది.

మొత్తం 30 బొమ్మల్లో 28 అమ్మాయిల బొమ్మలు ఉండగా, 2 అబ్బాయిల బొమ్మలు ఉన్నాయి.
అయితే, ఆన్‌లైన్‌లో ఆటని వీక్షిస్తున్న అభిమానులు ఆ బొమ్మలు సెక్స్ డాల్స్‌ని తలపిస్తున్నాయని ఆరోపించారు.

కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్లకి ప్రచారం కల్పించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. దీంతో, ఎఫ్‌సి సియోల్ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో తమ అభిమానులకి క్షమాపణ చెప్పింది.

ఆ బొమ్మల చేతిలో ఉన్న ప్రకటనలు ఒక సెక్స్ కంపెనీ నుంచి తమ సంస్థకి వచ్చిన ఆర్డర్లని ,ఆట ప్రారంభం కావడానికి ముందే బొమ్మలతో ఫోటోలు తీసుకుని వాటిని తొలగించాల్సి ఉందని కాకపొతే, అక్కడ తొలగించకుండా మిగిలిపోయిన హెయిర్ బాండ్లు, లోగోలు, ప్రజల కంటిలో పడకుండా తప్పించుకోలేకపోయాయని డాల్కం డైరెక్టర్ చొ యంగ్ జూన్ బీబీసీకి తెలిపారు.

డాల్కం సంస్థ గురించి బ్యాక్ గ్రౌండ్ తనిఖీలు నిర్వహించలేదని ఎఫ్‌సి సియోల్ అధికారి లి జి హూన్ బీబీసీకి చెప్పారు.
డాల్కం సంస్థకి సెక్స్ పరిశ్రమతో సంబంధాలు ఉన్నట్లు తమకు తెలియదని చెప్పారు.
మనుషుల్ని తలపించే విధంగా ఉన్నఈ బొమ్మలు సెక్స్ టాయ్స్‌లా ఉన్నాయనే ఆలోచన తమకి స్ఫురించలేదని అన్నారు.

By Julie