173 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే కెప్టెన్ ఫించ్ (7 బంతుల్లో 5; 1 ఫోర్) వికెట్ కోల్పోయింది.

ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ బౌలింగ్ చేసిన బౌల్ట్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. సౌతీ వేసిన రెండో ఓవర్లో వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 పరుగులు లభించాయి. మూడో ఓవర్‌లో మళ్లీ బంతినందుకున్న బౌల్ట్ వికెట్ తీయడంతో పాటు కేవలం 4 పరుగులే ఇచ్చాడు. మూడో బంతికి మిచెల్ క్యాచ్ పట్టడంతో ఆరోన్ ఫించ్ అవుటయ్యాడు.

అయితే తర్వాతి ఓవర్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంది. మిల్నే వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతిని సిక్సర్‌గా బాదిన మిచెల్ మార్ష్ తర్వాతి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు. తర్వాత మూడు సింగిల్స్ రావడంతో ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 15 పరుగులు రాబట్టింది. ఐదో ఓవర్‌లో సౌతీ ఒక సిక్సర్ ఇవ్వడంతో 10 పరుగులు వచ్చాయి. క్రీజులో డేవిడ్ వార్నర్ (18 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ (17 బ్యాటింగ్) ఉన్నారు.

స్టార్క్ వేసిన 16వ ఓవర్లో విలియమ్సన్ విజృంభించాడు. అతని ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన కేన్… మూడో బంతికి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. మళ్లీ చివరి రెండు బంతుల్లో మరో రెండు బౌండరీలతో కదం తొక్కాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో స్టార్క్‌కు ఇదే అత్యంత చెత్త ఓవర్. వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద (21 బంతుల్లో) కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను హేజెల్‌వుడ్ వదిలేశాడు. ఆ తర్వాత కేన్ 26 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో స్టార్క్ బౌలింగ్‌లో విలియమ్సన్ 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. 12 బంతులు ఎదుర్కొని 39 పరుగులు సాధించాడు. స్టార్క్ భారీగా పరుగులు సమర్పించుకోగా, 17వ ఓవర్ వేసిన కమిన్స్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్‌లో ఒక్క బౌండరీ కూడా రాలేదు. కేవలం 8 పరుగులు మాత్రమే లభించాయి. 18వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన హేజెల్‌వుడ్ 2 వికెట్లతో న్యూజీలాండ్‌ను కట్టడి చేశాడు. రెండో బంతికి ఫిలిప్స్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్), నాలుగో బంతికి కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు)లను పెవిలియన్ పంపాడు. దీంతో ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. ప్రపంచకప్ ఫైనల్లో 85 పరుగులు చేసిన విలియమ్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మార్లోన్ శామ్యూల్స్ (85 నాటౌట్)కూడా గతంలో ఫైనల్ మ్యాచ్‌లో ఇదే స్కోరు సాధించాడు. విలియమ్సన్, ఫిలిప్స్ మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు.

By Julie