Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
గ్రామీణ క‌ళాకారుల‌కు వేదిక యువ‌జ‌నోత్స‌వాలు
గ్రామీణ క‌ళాకారుల‌కు వేదిక యువ‌జ‌నోత్స‌వాలు
యువ‌త‌లో నిగూడీకృత‌మై ఉన్న‌ క‌ళ‌రూపాల‌ను వెలికితీసి వారిని ప్రోత్స‌హించేందుకే ప్ర‌భుత్వం యువ‌జ‌నోత్స‌వాల పోటీల‌ను నిర్వ‌హిస్తుంద‌ని అన్నారు రాష్ట్ర గృహ‌నిర్మాణ‌, దేవాదాయ‌, న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. ప‌ట్ట‌ణంలోని వైఎస్ఆర్ ఫంక్ష‌న్ హాల్‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన జిల్లా యువ‌జ‌నోత్స‌వ కార్య‌క్ర‌మానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యువజన కళాకారులను ప్రోత్సహిస్తూ వారి జాతీయ స్థాయిలో రాణించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా యువజనోత్సవాలను నిర్వహిస్తున్నాయ‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది వివిధ కళారంగాల్లో ఉన్నారన్నారు. అలాంటి వారికి వేదికగా ఈ యువజనోత్సవాలు నిలుస్తాయన్నారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో సైతం మంచి ప్రతిభ కనబర్చినట్లయితే జాతీయ స్థాయిలో వారి ప్రదర్శిన ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. 
నిర్మల్ జిల్లా యువజనోత్సవాల్లో 18 అంశాల్లో కళాకారులు తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరై తమ ప్రదర్శనలిచ్చారు. కూచిపుడి, ఫోక్, జానపద, నాటిక, గ్రూప్ డ్యాన్స్ తదితర అంశాల్లో కళాకారుల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌ శివలింగయ్య, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణారావు, ఏఎస్పీ దక్షాణామూర్తి, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, సత్యనారాయణ, వాజీద్‌ఖాన్, ధర్మాజి శ్రీనివాస్, ఎంపీడీవో గజ్జారాం, తహసీల్దార్ శంకర్, ద‌శ‌ర‌థ్ తదితరులు పాల్గొన్నారు.
Read More
నిర్మల్‌లో జిల్లాస్థాయి యువజనోత్సవాలు
నిర్మల్‌లో జిల్లాస్థాయి యువజనోత్సవాలు
ఈనెల 21 మంగళవారం నుండి  జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంస్కృతిక అంశాలలో యువజనోత్సవ పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడలశాఖ అధికారి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను మున్సిపల్  ఫంక్ష‌న్‌హాల్‌లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని 19 మండలాలకు చెందిన కళాకారులు, యువతీ, యువకులు ఈ పోటీల్లో పాల్గొనాల‌ని ఆయన కోరారు. విజేతలుగా నిలిచిన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.  జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనే యువతీ యువకుల వయస్సు ఈ నెల 21వ తేదినాటికి 15 సంవత్సరాలు నిండి ఉండి 29 సంవత్సరాలలోపు ఉండాలని ఆయన సూచించారు. గత మూడు సంవత్సరాలలో నిర్వహించిన జాతీయ యువజనోత్సవాలలో పాల్గొన్న యువతీ యువకులుగాని, గ్రూపులుగాని ఈ సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడానికి అనుమతించబడరని కృష్ణారావు తెలిపారు.  
విభాగాలుః1)కూచిపూడి 2)భ‌ర‌త‌నాట్యం 3) క‌థ‌క్ 4) ఒడిస్సి 5) మ‌ణిపురి 6) ఫోక్‌సాంగ్ (గ్రూప్‌) 7) ఫోక్‌డ్యాన్స్ (గ్రూప్‌) 8) క‌ర్ణాట‌క హుక‌ల్ 9) హిందుస్థాన్ హుక‌ల్ 10) ఫ్లూట్ 11) మృదంగం 12) వీణా 13) సితార్ 14) త‌బ‌ల 15) గిఠార్ 16) హ‌ర్మోనియం 17) వ‌న్‌యాక్ట్‌ప్లే (గ్రూప్) హిందీ/ఇంగ్లీష్ 18) ఎలుక్యూష‌న్ (వాక్త‌త్వ‌) పోటీ  హిందీ లేదా ఇంగ్లీష్ ల‌లో పోటీలు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. మరిన్ని వివరాల కొరకు సెల్‌నంబ‌ర్.. 9849913071, 9398535668, 08734-242844 లకు సంప్రదించాలని ఆయన కోరారు.
 
Read More
ఏడాదంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ!
ఏడాదంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ!

అవును, ఎయిర్ టెల్ త‌మ 4జీ నెట్ వ‌ర్క్ లోకి మారే క‌స్ట‌మ‌ర్ల‌కు కొత్త ఏడాదంతా ఉచిత డేటా అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 4జీ మొబైల్ హ్యాండ్ సెట్ క‌స్ట‌మర్లంద‌రికీ ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు ఎయిర్ టెల్ సంస్థ తెలిపింది. ఈ ఆఫ‌ర్ కింద ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్యాక్స్ నూ 2017 డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి నెలా 3జీబీ డేటాను ఎయిర్ టెల్ ఉచితంగా అందించనుంది. జనవరి 4, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2017 మధ్య ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అప్పటివరకు ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్లోకి మారాలని సూచించింది. కంపెనీ ప్యాక్ ప్రయోజనాలకు ఈ ఉచిత డేటా తక్కువగా లేదా ఎక్కువగానూ ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. అందుబాటులోని ధరలకు యూజర్లకు 4జీ నెట్వర్క్ అనుభవం పొందడానికి ఈ ఆఫర్ను తీసుకొస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఈ ఉచిత డేటా ఆఫర్ కింద అన్ని రకాల ప్రయోజనాల‌తో పాటు కొత్త 4జీ హ్యాండ్సెట్లోకి అప్గ్రేడ్ అయ్యే ప్రస్తుత ఎయిర్టెల్ కస్టమర్లకూ ఇది వర్తించనుంది. ఇదిలా ఉంటే టెలికాం ఇండస్ట్రిలో గుబేలు పుట్టిస్తూ మళ్లీ రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లను 2017 మార్చి తర్వాత మళ్లీ జియో తన ఆఫర్లను పొడిగించాలని యోచిస్తుందని టెలికాం విశ్లేషకులు చెబుతున్నారు. 

Read More
యువ‌తే దేశానికి బ‌లం
యువ‌తే దేశానికి బ‌లం
- ఘ‌నంగా ప్రారంభ‌మైన యువ‌జ‌నోత్స‌వాలు
- యువ‌త అన్ని రంగాల్లో రాణించాల‌ని జేసీ పిలుపు
చ‌దువు ప‌ట్లా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తూనే ఆస‌క్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని రాణించాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు జాయింట్ క‌లెక్ట‌ర్ శివ‌లింగ‌య్య‌. రోజురోజుకు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణంలో మంగ‌ళ‌వారం వైఎస్ఆర్ ఫంక్ష‌న్ హాల్ లో జిల్లా స్థాయి యువ‌జ‌నోత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వాల‌ను జేసీ శివ‌లింగ‌య్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ యువ‌జ‌నోత్స‌వాల‌న‌గానే ముందుగా స్వామి వివేకానందుడు గుర్తుకొస్తార‌ని ఆయ‌న‌ అన్నారు. దేశ ఔన‌త్యాన్ని ప్ర‌పంచ‌దేశాల‌కు చాటిన మ‌హ‌నీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. జ‌న‌వ‌రి 12న స్వామి వివేకానంద జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌భుత్వం ఈ యువ‌జ‌నోత్స‌వాల‌ను ప్ర‌తీ ఏటా నిర్వ‌హిస్తుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వివిధ ర‌కాల పోటీల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. అలాగే రాష్ట్ర‌స్థాయిలో స‌త్తా చాటిన యువ‌త‌కు జ‌న‌వ‌రి 12న హ‌రియానాలో నిర్వ‌హించే జాతీయ స్థాయి యువ‌జ‌నోత్స‌వాల్లో పాల్గొనే అవ‌కాశ‌ముంటుంద‌ని, నిర్మ‌ల్ జిల్లా యువ‌తీయువ‌కులు త‌మకు న‌చ్చిన రంగాల‌ను ఎంచుకుని పోటీల్లో రాణించాల‌ని సూచించారు. 
రాష్ట్ర‌, జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా యువ‌త త‌మ స‌త్తా చాటాల‌ని అన్నారు. మ‌న దేశంలో ఉన్న అవకాశాలు మ‌రేదేశంలో లేవ‌న్నారు. మ‌న‌దేశ సంస్కృతీ సంప్రదాయాల‌ను ప్ర‌పంచ దేశాలు ఎంత‌గానో గౌర‌విస్తున్నాయ‌న్నారు. అనంత‌రం నట‌రాజ నృత్య క‌ళా బృందం ప్రారంభోత్స‌వ నృత్యాన్ని చేశారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన యువ‌తీ యువ‌కులు సాంస్కృతిక పోటీల్లో పాల్గొని త‌మ స‌త్తా చాటారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా యువ‌జ‌న‌, క్రీడ‌ల అధికారి కృష్ణారావు, ఎంపీపీ అల్లోల సుమ‌తీ గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఎంపీడీవో మోహ‌న్, కౌన్సిల‌ర్ పొడెల్లి గ‌ణేష్, వివిధ క‌ళాశాల‌, పాఠ‌శాల విద్యార్థులు పాల్గొన్నారు.
 
వెబ్ సైట్ లో యాడ్స్ కోసం సంప్ర‌దించాల్సిన నెంబ‌ర్లు :
9010066005, 8555019807
 
 
 
Read More
జియో సిమ్ ఉంటే ఆడుకోవ‌చ్చు
జియో సిమ్ ఉంటే ఆడుకోవ‌చ్చు
ఐదు నెలల కింద‌ట‌ ప్రపంచంలోని పలు దేశాల్లో విడుదలై సంచలనం సృష్టించిన పోకిమాన్ గో గేమ్ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. ఆ గేమ్ తయారీ సంస్థ అయిన నియాంటిక్... భారత్‌లో రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఆ గేమ్‌ను మన దగ్గర విడుదల చేసింది. పోకిమాన్ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ తమ యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని గేమ్ ఆడుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 8.0 ఆపైన వెర్షన్ ఉన్న యూజర్లు ఈ గేమ్‌ను తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
అయితే పోకిమాన్ గో విడుదల అయిన సందర్భంగా దేశంలో ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, దాని పార్ట్‌నర్ స్టోర్స్‌లలో పోకిస్టాప్స్, జిమ్స్ పేరిట ఆ గేమ్ కోసం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. గేమ్‌కు సంబంధించి కొనుగోళ్లు, ఇతర సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ హబ్‌లు పనిచేస్తాయి. అదేవిధంగా జియో సిమ్ వినియోగదారులు ఎలాంటి డేటా చార్జిలు లేకుండానే ఈ గేమ్‌ను మార్చి 31, 2017 వరకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఆ సిమ్ యూజర్లు తమ ఫోన్లలో ఉండే జియో చాట్ యాప్‌ను ఓపెన్ చేస్తే అందులో పోకిమాన్ గో గేమ్‌కు సంబంధించిన ప్రత్యేక చానల్ అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా గేమ్ ప్రియులు పోకిమాన్ గో కు సంబంధించిన సూచనలు, మెళకువలను సులభంగా తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్ లో యాడ్స్ కోసం సంప్ర‌దించాల్సిన నెంబ‌ర్లు :
9010066005, 8555019807
 

 

Read More
ఒక్కొక్క‌రిపై స‌గ‌టున‌ వెయ్యి రూపాయ‌లట‌!
ఒక్కొక్క‌రిపై స‌గ‌టున‌ వెయ్యి రూపాయ‌లట‌!
ఫేస్ బుక్. ప్ర‌పంచంలో ఈ పేరు తెలియ‌ని వారు బ‌హుషా ఉండ‌రేమో. కోట్లాది మంది ప్ర‌జ‌ల ముఖ‌పుస్త‌కాల్లోకి చొచ్చుక‌పోయింది. కొన్ని కోట్ల‌ మంది ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కు ఫేస్ బుక్ లోనే గ‌డిపేస్తున్నారు.  ప్ర‌స్తుతం చాలా మంది జీవితాల్లో ఫేస్ బుక్ ఒక పార్ట్ అయ్యిందన‌డంలో అతిశ‌యోక్తిలేదు. అసలు ఫేస్ బుక్ లేనిదే ఎవ్వరికి రోజు గడవడం లేదంటే అంతలా మ‌నం ఫేస్ బుక్ కు బ‌క్కైపోయాము. ఫోటో దిగిన‌ప్పుడు.. మ‌న‌సులోని భావాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌న్నా.. కామెంట్ చేయాలన్నా.. షాపింగ్ కు వెళ్లినప్పుడు.. టూర్ కి వెళ్లిన‌ప్పుడు ఒక‌టేమీ.. ఏది చేసినా ఫేస్ బుక్ లో పెట్టాల్సిందే. ఇప్పుడు ప్ర‌పంచం ఫేస్ బుక్ చుట్టే తిరుగుతోంది. ఇలా ఫేస్ బుక్ ఎంతలా వాడుతున్నారంటే.. మిగిలిన సోషల్ మీడియాల క‌న్నా ఫేస్ బుక్ నే ఎక్కువ‌గా వాడేస్తున్నార‌ట‌. 
అస‌లు ఫేస్ బుక్ ను మనం ఎంతగా వాడుతున్నామో అంతకు మించిన ఆదాయాన్ని మన ద్వారా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బ‌ర్గ్ కు అందిస్తోంది. మ‌న ఫేస్ బుక్ అకౌంట్లే ఆ సంస్థకు పెట్టుబడి. ప్రపంచంలోని ఒక్కో ఖాతాదారుడిపై సగటున రూ.1056 (16 డాలర్లు) సంపాదిస్తోందట. ఈ లెక్క‌న 179 కోట్ల మందికి పైగా యూజ‌ర్లున్న ఫేస్ బుక్ కు ఎంత ఆదాయమొస్తుందో మీరే అర్థం చేసుకొండి. ఫేస్ బుక్ ఎక్కువ‌గా కెనడా, అమెరికాల్లోని ఖాతాదారులపై భారీగా ఆదాయం గడిస్తోందట. ఫేస్‌బుక్ త్రైమాసిక ఆదాయం వాల్‌స్ట్రీట్ అంచనాలను మించి 50శాతం పెరిగింది. ఫేస్‌బుక్ వైబ్‌సైట్‌తో పాటు బాగా పాపులర్ అయిన మొబైల్‌యాప్‌, కొత్తగా ప్రవేశపెట్టిన లైవ్ స్ట్రీమింగ్ వీడియో సదుపాయం కారణంగా ఫేస్‌బుక్‌లో ప్రకటనలు భారీగా పెరిగాయి. మెరుగైన ఫలితాలతో కంపెనీ షేర్లు దాదాపు 10 శాతం మేర లాభపడింద‌ట‌. ఫేస్‌బుక్‌ను నెలకు దాదాపు 1.65 బిలియన్ల మంది వినియోగిస్తున్నట్లు.. వినియోగదారులు రోజుకు సుమారు 50 నిమిషాల పాటు ఫేస్‌బుక్‌పై గడుపుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
 
Read More