Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మ‌హిళ‌ల్లో ప్ర‌శ్నించేత‌త్వం  రావాలి
మ‌హిళ‌ల్లో ప్ర‌శ్నించేత‌త్వం రావాలి
- జిల్లా స‌ద‌స్సులో రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌
దేశంలో మహిళల సాధికారత కోసం ఎన్నో చట్టాలు అమలు అవుతున్నా.. మహిళలో అవగాహన రాహిత్యం వలన ఎంతో మంది మహిళలు లైంగిక వేదింపులకు, అవమానాలకు గురవుతున్నారని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళల చట్టాలు అవగాహన సదస్సును కలెక్టర్ ఇలంబరితితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలు ఎన్నో రకాల హింసలు, అవమానాలు, వివక్షతలకు గురవుతున్నారని, వారికోసం ఎన్నో చట్టాలున్నా.. వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. వరకట్న వేధింపులు, గృహహింస, నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా.. మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. 
మహిళలు ప్రశ్నించేతత్వం అలవర్చుకుంటే చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుందని వెంకటరత్నం అన్నారు. మండల, గ్రామాల్లో చట్టాలు, హక్కులపై మహిళలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు చదువుకునేలా చూడాలని అన్నారు. మారుమూల గ్రామాల్లో ఆడపిల్లలపై ఇంక వివక్షత చూపిస్తున్నారని, అది కరెక్ట్ కాదని తెలిపారు. అంగ‌న్ వాడి సెంట‌ర్ల‌లో ఆడ శిశువుల‌కు పౌష్టికాహారంతో పాటు వారి త‌ల్లుల‌కు ఇలాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆమె సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో హైకోర్టు న్యాయ‌వాది మంజూష‌, ఆర్డీవో ప్ర‌సూనాంబ‌, జిల్లా సంక్షేమాధికారి విజ‌య‌ల‌క్ష్మీ, డీఈవో ప్ర‌ణీత‌, ప్రేమ‌ల‌, ప‌ట్ట‌ణ మ‌హిళ కౌన్సిల‌ర్లు, అంగ‌న్‌వాడి టీచ‌ర్లు, ఐకేపీ మ‌హిళ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
Read More
సామాజిక ప‌రివ‌ర్త‌న‌తోనే మ‌హిళల అభివృద్ధి
సామాజిక ప‌రివ‌ర్త‌న‌తోనే మ‌హిళల అభివృద్ధి
- చ‌ట్టాల గురించి ప్ర‌తీ మ‌హిళా తెలుసుకోవాలి
- మ‌హిళా దినోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్న జ‌డ్జీ విక్ర‌మ్
సామాజిక ప‌రివ‌ర్త‌న మ‌హిళా సంక్షేమ సంఘం ఆద్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా ముగిశాయి. నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భ‌వ‌న్ లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా సీనియ‌ర్ సివిల్ జ‌డ్జీ విక్ర‌మ్, మొద‌టి శ్రేణి న్యాయ మూర్తి చంద్ర‌శేఖ‌ర్, మాత‌, శిశు సంక్షేమ శాఖ అధికారిణి విజ‌య‌ల‌క్ష్మీ తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కృష్ణంరాజు హాజ‌ర‌య్యారు. సామాజిక ప‌రివ‌ర్త‌న సంక్షేమ సంఘం అద్య‌క్షురాలు నిర్మ‌ల అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో తొలుత సావిత్రిబాయ్ పూలే చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. 
ఈ సంద‌ర్భంగా సివిల్ జ‌డ్జీ విక్రమ్ మాట్లాడుతూ భార‌త రాజ్యాంగం ఆర్టిక‌ల్14 ప్ర‌కారం మ‌హిళ‌ల‌కు పురుషుల‌తో స‌మానంగా స‌మాన‌త్వ‌పు హ‌క్కును ప్ర‌సాధించింద‌ని, చ‌ట్టాల గురించి ప్ర‌తీ మ‌హిళ అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. సామాజిక ప‌రివ‌ర్త‌న‌తోనే మ‌హిళ‌ల స‌ర్వోన్న‌త అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని అన్నారు. అనంత‌రం నిరుపేద‌లైన 60 మంది మ‌హిళ‌ల‌కు బియ్యం, చీర‌ల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎన్జీవో నేత ప్ర‌భాక‌ర్, డాక్ట‌ర్ స‌రోజ‌, సామాజిక ప‌రివ‌ర్త‌న సంఘ స‌భ్యులు వ‌న‌మాల‌, ల‌క్ష్మీ, జ్యోతి, స‌ర‌స్వ‌తి తదిత‌రులు పాల్గొన్నారు. 
 
Read More
మ‌హిళ‌ల ఆర్థికాభివృద్దే ప్ర‌భుత్వ ధ్యేయం
మ‌హిళ‌ల ఆర్థికాభివృద్దే ప్ర‌భుత్వ ధ్యేయం

- రాష్ట్ర గృహ‌నిర్మాణ‌,న్యాయ‌,దేవాదాయ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి
స‌మాజంలో మ‌హిళ‌లు ఆర్థికంగా బ‌ల‌ప‌డిన‌ప్పుడే గ్రామాలు అభివృద్ది జ‌రుగుతుంద‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని దివ్య గార్డెన్స్‌లో ద‌క్క‌న్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రుణ‌మేళా కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మ‌హిళ‌ల స్వాలంబ‌న‌కు మంగ‌ళ‌వారం రోజు 1410 మ‌హిళా సంఘాల గ్రూపుల‌కు రూ.51 కోట్ల రుణాల‌ను అందించ‌డం జ‌రిగింద‌న్నారు. మ‌హిళా సంఘాలు స్వ‌శ‌క్తితో, కార్య‌దీక్ష‌తో ముందుకెళ్తున్నాయ‌న్నారు. మ‌హిళ‌లు తాము తీసుకున్న రుణాల‌ను స‌కాలంలో చెల్లిస్తూ, త‌మ వ్యాపారాల‌ను దిగ్విజ‌యంగా న‌డుస్తున్నాయ‌ని తెలిపారు.  

మ‌హిళ‌లు ఆర్థికంగా బ‌ల‌ప‌డిన‌ప్పుడే గ్రామాల‌తో పాటు రాష్ట్ర, దేశాభివృద్ది జ‌రుగుతుంద‌న్నారు. గ్రామైక్య సంఘాల‌కు సంఘ భ‌వ‌నాల నిర్మాణాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాలకు రుణ‌సౌక‌ర్యాలు, స‌బ్సీడిలు ప్ర‌క‌టించడం జ‌రిగింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా సంఘాల‌కు రూ.51 కోట్ల రూపాయ‌లు చెక్కుల‌ను పంపిణి చేయ‌డం జ‌రిగిందన్నారు.  
అనంత‌రం ముధోల్ ఎమ్మేల్యే విఠ‌ల్‌రెడ్డి మాట్లాడుతూ మ‌హిళా సంఘాలు తాము పొందిన రుణాల‌ను స‌కాలంలో బ్యాంకుల‌కు 100 శాతం తిరిగి చెల్లిస్తూ, వాటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. రుణాలు పొందిన మ‌హిళ‌లు ఆ డ‌బ్బును పాడిప‌రిశ్ర‌మ‌, కిరాణాషాపు, పిల్ల‌ల చ‌దువుల‌కు వినియోగించుకుని ల‌బ్ధి పొందాల‌న్నారు. జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ సి.హెచ్‌.శివ‌లింగ‌య్య మాట్లాడుతూ మ‌హిళ‌లు దిన‌దినాభివృద్ది చెంది ఆర్థిక స్వాలంభ‌న దిశ‌లో ప‌య‌నించాల‌ని సూచించారు. వ‌డ్డీలేని రుణాలు పొందిన మ‌హిళ‌లు స్వ‌యంశ‌క్తితో అభివృద్దిబాట‌లో ప‌య‌నిస్తున్నాయ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మునిసిప‌ల్ ఛైర్మన్ అప్పాల గ‌ణేష్ చ‌క్ర‌వ‌ర్తి, డీజీబీ రీజిన‌ల్ మేనేజ‌ర్ బిఆర్‌వి రామ‌చంద్రారెడ్డి, ఏఎంసీ ఛైర్మెన్లు దేవెంద‌ర్‌రెడ్డి, రాజ్‌మ‌హ్మ‌ద్‌, ఎఫ్ఎసిఎస్ ఛైర్మెన్ రాంకిష‌న్‌రెడ్డి,డీఆర్డీవో వెంక‌టేశ్వ‌ర్లు, డీసీవో, మ‌హిళా స్వ‌శ‌క్తి సంఘాల స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
చ‌లివేంద్రం ప్రారంభించిన మంత్రి
వేస‌విలో ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డం కోసం చ‌లివేంద్రం ఏర్పాటుచేసి తాగునీరు అందించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి. మంగ‌ళ‌వారం సాయంత్రం శివాజీచౌక్ స‌మీపంలో ఆయ‌న చ‌లివేంద్రాన్ని ప్రారంభించారు. వేస‌విలో ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డానికి మ‌రిన్ని చ‌లివేంద్రాల‌ను ఏర్పాటుచేయాల‌ని ఆయ‌న సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మునిసిప‌ల్ చైర్మ‌న్ అప్పాల గ‌ణేష్ చ‌క్ర‌వ‌ర్తి, ఏఎంసీ ఛైర్మెన్ దేవెంద‌ర్‌రెడ్డి, రాజ్‌మ‌హ్మ‌ద్‌, ఎఫ్ఎస్‌సిఎస్ ఛైర్మెన్ రాంకిష‌న్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Read More
చదువుల త‌ల్లి సావిత్రిబాయ్..
చదువుల త‌ల్లి సావిత్రిబాయ్..
 
త‌మ కోసం, త‌మ కుటుంబం కోస‌మే బ‌తికేవారు కొంద‌రుంటారు.. కానీ, త‌ను బ‌తుకుతూ మ‌రో ప‌ది మందికి వెలుగు ఇవ్వాల‌నుకునే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ కోవ‌కే చెందారు మ‌హాత్మ జ్యోతిరావు పూలే భార్య సావిత్రి బాయ్ పూలే. ఎలాంటి సౌక‌ర్యాలు లేని స‌మ‌యంలోనే ఎన్నో క‌ష్టాలు ప‌డి మ‌రెన్నో విమ‌ర్శ‌లెదుర్కోని ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన మ‌హ‌నీయురాలు సావిత్రి బాయ్ పూలే. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటమే తమ సామాజిక బాధ్యతగా భావించారు. అందుకోసం భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు ఎంతో కృషి చేశారు. 
 
మ‌హారాష్ట్ర‌లోని స‌తారా జిల్లా న‌యాగావ్ లో జ‌న‌వ‌రి 3, 1831 లో సావిత్రిబాయ్ పూలే జ‌న్మించింది. త‌న తొమ్మిద‌వ ఏట‌నే జ్యోతిరావ్ పూలే ని వివాహం చేసుకుంది. వివాహం విద్య‌కు అడ్డంకి కాద‌ని నిరూపిస్తూ విద్యాభ్యాసాన్ని కొన‌సాగించాల‌నుకుంది. మొద‌ట్నుంచి చ‌దువుపై ఎంతో ఆసక్తి క‌న‌బ‌ర్చిన సావిత్రిని భ‌ర్త‌ జ్యోతి రావ్ పూలే ఎంతో ప్రోత్స‌హించారు. భ‌ర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి చ‌దువుల త‌ల్లిగా ఎదిగింది.  భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా 1876 లో పాఠశాల ప్రారంభించింది. పాఠ‌శాల ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. దళితుల, స్ర్తీల విద్యా వ్యాప్తికి సావిత్రి పూలే ఎంత‌గానో కృషి చేసింది. ఆమె ప్రాభించిన పాఠ‌శాల దేశంలోనే మొట్ట‌మొద‌టి బాలిక‌ల పాఠ‌శాల‌గా పేరుగాంచింది. అది ప్రారంభ‌మైన ఏడాదికే మ‌హారాష్ట్ర‌లో మ‌రో 50 పాఠ‌శాలల‌ను సావిత్రి పూలే స్థాపించారు. ఈ క్ర‌మంలో ఆధిప‌త్య కులాల వారి నుంచి అనేక దాడుల‌ను, అవ‌మానాలను ఎదుర్కున్నారు. 
 
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. తోటి మ‌హిళ‌ల‌కి, కులం జీవ‌న విధానానికి అతీతంగా అంద‌రు మ‌హిళ‌లూ విద్యావంతుల‌వ్వాల‌ని కృషి చేయ‌డం ప్రారంభించింది. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. ఆమె చేసిన సేవ‌కు అప్ప‌టి బ్రిటీష్ ప్ర‌భుత్వం ఉత్త‌మ ఉపాద్యాయురాలుగా స‌త్క‌రించింది. 1890 లో  అత్యంత భ‌యంక‌ర ప్లేగు వ్యాధి మ‌హారాష్ట్ర‌ని వ‌ణికించింది. ఎంద‌రో అభాగ్యుల‌ను చేర‌దీసి విద్యాబుద్ధులు నేర్పిన ఆ దంప‌తులు ప్లేగు వ్యాధికి బ‌లైయ్యారు. మార్చి 10, 1897 లో సావిత్రి బాయ్ మ‌ర‌ణించింది. 
Read More
'ఐర‌న్' లేడీస్ కావాలంటే!
'ఐర‌న్' లేడీస్ కావాలంటే!

ఉరుకులు పరుగుల జీవితంలో త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం ప్రతి మహిళలను నేడు వేధిస్తున్న ప్రధాన సమస్య. దీని నివారణకు కావాల్సిందల్లా ఐరన్‌. ఐరన్‌ శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఐరన్‌ లోపం వల్ల లావు తగ్గడం, తరచూ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. 

 

ఐరన్‌ లభించే పదార్థాలు ఉడికించిన గుడ్డు, చేపలు, బీన్స్‌, ఆకుకూరలు, పచ్చని కూరలు, డ్రైఫ్రూట్స్‌, సోయా, మాంసం, రాగులు వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. ఐరన్‌ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. శరీరానికి ఆక్సిజన్‌ అందించే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వదు. బిడ్డ నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపే ఐరన్‌ను గర్భీణులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. నెలసరి సమస్యలు ఎదుర్కొనేవారు, బాలింతలు తప్పక ఐరన్‌ తీసుకోవాలన్నది వైద్యుల మాట.

Read More
మహిళలు మహరాణులు
మహిళలు మహరాణులు
నిర్మల్ గ్రామ పురస్కారాలు అందుకున్న మహిళా సర్పంచ్‌లు
జిల్లాలో ఇద్దరికి.. ఆ రెండూ చల్లపల్లి మండలానికే
పురస్కారాలతో మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి
 
ఆ ఇద్దరు మహిళలు శివారు గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు. అన్ని వసతులు ఉండి విద్యావంతులు, నిధులు దండిగా ఉండే పంచాయతీలు చేయలేని పనిని సవాల్‌గా చేసి చూపించారు. గ్రామీణ ప్రాంతం, అందునా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే శివారు పంచాయతీలైన యార్లగడ్డ, వెలివోలు సర్పంచ్‌లు యార్లగడ్డ సాయిభార్గవి, తలశిల విజయకుమారి పూర్తిస్థాయిలో  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఇటీవల నిర్మల్ గ్రామపురస్కారాలను అందుకున్నారు. జిల్లాలో రెండు పంచాయతీలకు ఈ పురస్కారాలు లభించగా, ఆ రెండూ చల్లపల్లి మండలానివే కావడం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఇద్దరూ మహిళలు  కావడం అభినందనీయం. సమర్థవంతమైన పాలకులు ఉంటే పల్లెలు సైతం పట్టణాలకు తీసిపోవని నిరూపిస్తున్న ఈ ఇద్దరు మహిళామణులపై ప్రత్యేక కథనం.    - చల్లపల్లి
 
చల్లపల్లి : రాష్ట్రంలో 2013 సంవత్సరానికి గాను నిర్మల్ గ్రామ పురస్కారాలకు 27 పంచాయతీలను ఎంపిక చేయగా అందులో రెండు జిల్లాకు దక్కాయి. ఆ రెండూ చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ (యార్లగడ్డ సాయిభార్గవి-సర్పంచ్), వెలివోలు (తలశిల విజయకుమారి-సర్పంచ్) గ్రామపంచాయతీలకు రావడం, అందునా మహిళా సర్పంచ్‌లకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఈ పురస్కారం ద్వారా యార్లగడ్డకు రూ.6 లక్షలు, వెలివోలుకు రూ.3 లక్షలు చొప్పున నగదు అవార్డు లభించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు సిహెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఇద్దరు సర్పంచ్‌లు అవార్డులను అందుకున్నారు. తొలి విడతగా యార్లగడ్డకు రూ.1.50 లక్షలు, వెలివోలుకు రూ.75 వేలు చొప్పున చెక్కులు అందజేశారు.
 
యార్లగడ్డకు పురస్కారం ఇలా..
 
యార్లగడ్డ గ్రామపంచాయతీ 1950లో ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా 1,950 మంది ఉండగా, యార్లగడ్డ సాయిభార్గవి సర్పంచ్‌గా ఉన్నారు. పంచాయతీ పరిధిలో 415 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 47 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినందుకు గాను నిర్మల్ గ్రామ పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద ఇచ్చే రూ.6 లక్షలను పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
పంచాయతీ ప్రత్యేకతలు ఇవే..
 
జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామమిది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలతో అలరారుతుంటుంది. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న 18 ఎకరాల చెరువు గ్రామానికి మణిహారంలా ఉంటుంది. చుట్టూ కొబ్బరిచెట్లతో ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ, పక్కా రహదారులు దర్శనమిస్తుంటాయి. ఇటీవల గ్రామంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు.
 

మరింత బాధ్యత పెరిగింది
 
నిర్మర్ పురస్కారంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. గ్రామంలో గతంలో గ్రంథాలయం ఉండేది, ఇప్పుడు పనిచేయడం లేదు. దాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామంలో మరిన్ని మొక్కలను నాటి సంరక్షణకు చర్యలు చేపడతాం. చెరువు మధ్యలో ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.             - యార్లగడ్డ సాయిభార్గవి, సర్పంచ్, యార్లగడ్డ
 
వెలివోలును వరించిందిలా..
 
వెలివోలు గ్రామపంచాయతీని 1958లో ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో 1,650 మంది జనాభా ఉండగా, సర్పంచ్‌గా తలశిల విజయకుమారి పాలన సాగిస్తున్నారు. గ్రామంలో 362 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 42 మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా నిర్మల్ గ్రామపురస్కారం లభించింది. దీని ద్వారా రూ.3 లక్షల నగదు అందజేస్తారు.
 
పంచాయతీ ప్రత్యేకలు ఇవే
 
ఈ పంచాయతీలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉంది. మూడు కిలోమీటర్ల మేర గ్రామంలో 14 సిమెంట్ రహదారులున్నాయి. జెడ్పీ పరిధిలో శ్రీకాకుళం-నడకుదురులో రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డు, ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. మెట్ట పంటలకు ప్రసిద్ధి పొందిన ఈ పంచాయతీలో చెరుకు, అరటి వంటి వాణిజ్య పంటలు, ఉద్యాన వన పంటలతో పాటు పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి గాంచింది.  
 
 పంచాయతీ భవనం నిర్మించాలి
 
 గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంది. వ్యవసాయ, వాణిజ్య పంటలతో పాటు పట్టు పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాను.    - తలశిల విజయకుమారి, సర్పంచ్, వెలివోలు
 
COURTESY: SAKSHI
Read More