Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ఓట‌ర్ల తుది జాబితా సిద్దం
ఓట‌ర్ల తుది జాబితా సిద్దం

- జిల్లాలో మ‌హిళా ఓట‌ర్లే అధికం

డిసెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌బోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఎన్నిక‌ల క‌మీష‌న్ ఓట‌ర్ల తుది జాబితాను శ‌నివారం విడుద‌ల చేసింది. 1 జ‌న‌వ‌రి 2018 నాటికి 18 సంవ‌త్స‌రాలు నిండిన యువ‌త‌కు ఓటు హ‌క్కు న‌మోదుకు అవ‌కాశం ఇవ్వ‌డంతో పెద్ద సంఖ్య‌లో కొత్త ఓట‌ర్లు త‌మ పేర్ల‌ను నమోదుచేసుకున్నారు. నిర్మ‌ల్ జిల్లాలో ని నిర్మ‌ల్‌, ఖానాపూర్‌, ముధోల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య అధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హిళా ఓట‌ర్లు త‌మ స‌త్తా చూప‌నున్న‌ట్లు తెలుస్తుంది. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 2 లక్ష‌ల 10వేల 462 మంది కాగా వీరిలో పురుషులు 99534 మంది, మ‌హిళ‌లు 1 ల‌క్ష 10 వేల 900 మంది ఉన్నారు. అలాగే ఖానాపూర్ నియోజ‌క‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 1 ల‌క్ష 85 వేల 235 మంది కాగా వీరిలో పురుషులు 91 వేల 655 మంది కాగా, మ‌హిళ‌లు 93 వేల 554 మంది ఉన్నారు. ముధోల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 2 ల‌క్ష‌ల 13 వేల 665 మంది కాగా వీరిలో పురుషులు 1 ల‌క్ష 4 వేల 666 మంది కాగా, మ‌హిళ‌లు 1 ల‌క్ష 8 వేల 982 మంది ఉన్నారు. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 6 ల‌క్ష‌ల 9 వేల 362 మంది ఓట‌ర్లు కాగా పురుషులు 2 ల‌క్ష‌ల 95 వేల 855 మంది, మ‌హిళ‌లు 3 ల‌క్ష‌ల 13 వేల 436 మంది ఉన్నారు. పురుషుల‌తో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా 17581 మంది మ‌హిళా ఓట‌ర్లు అధిక‌సంఖ్య‌లో ఉన్నారు. 

Read More
కీడు సోకిందని ఊరంతా వనవాసం
కీడు సోకిందని ఊరంతా వనవాసం


- సూర్యాపేట్‌ జిల్లాలో..

వనవాసానికి వెళ్తున్న శెట్టిగూడెం గ్రామస్తులు

సూర్యాపేట్‌ జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) గ్రామమిది. ఈ ఊర్లో నెలరోజులుగా చాలా మందికి జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌, నల్లగొండల్లో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందినా జ్వరం తగ్గడం లేదు. గ్రామాల్లో వైద్యశాఖ శిబిరాలు ఏర్పాటుచేసినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో ఊరికి కీడు సొకిందని అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లాలని పెద్దమనుషుల సమక్షంలో నిశ్చయించారు. దీంతో ఆదివారం అందరూ తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరిబయటకు వెళ్లారు. ఇలా ఎన్నిరోజులపాటు అడవిలో ఉంటారనేదానిపై గ్రామపెద్దలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  

వనవాసంలో భోజనం చేస్తున్న గ్రామస్తులు

 
శెట్టిగూడెంలో ఇళ్లకు వేసిన తాళాలు

Read More
మేరోళ్లంటే అంత చుల‌క‌నా సారూ..
మేరోళ్లంటే అంత చుల‌క‌నా సారూ..

మున్సిప‌ల్, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు పై మేరు సంఘం నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. బుధ‌వారం నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో త‌మ కుల‌స్తుల మ‌నోభావాలు దెబ్బ తీసేలా  వ్యాఖ్య‌లు చేసిన మంత్రి బేష‌ర‌త్తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ నిర్మ‌ల్ జిల్లా బైంసా మేరు సంఘం నాయ‌కులు ఆర్డీవో కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ బాద్య‌తాయుత ప‌ద‌విలో ఉండి మంత్రి ఇలా వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌న్నారు. మంత్రి కేటీఆర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. బుధ‌వారం నిజామాబాద్‌లో ప‌ర్య‌టించిన మంత్రి కేటీఆర్ అక్క‌డ ఐటీ హ‌బ్ శంకుస్థాప‌న అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై పిట్ట క‌థ‌ను వివ‌రిస్తూ మేరు కుల‌స్తుల‌ను కించప‌రిచే విధంగా మాట్లాడార‌ని నాయ‌కులు తెలిపారు. 

 

Read More
గ్లైఫోసేట్‌ మహా డేంజర్‌!
గ్లైఫోసేట్‌ మహా డేంజర్‌!

- ఆలస్యంగా నిద్రలేచిన తెలంగాణ సర్కార్‌
- కేంద్రం ఆదేశాలతో గ్లైఫోసేట్‌పై నిషేధం
- కలెక్టర్లకు వ్యవసాయశాఖ ఆదేశాలు
- బీజీ-3 పత్తిపై ఉక్కుపాదం

పర్యావరణంతో పాటు జీవజాతికి ప్రమాదకరంగా మారిన గ్లైఫోసేట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిషేధం విధించింది. ఈ మందు కారణంగా.. తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయంటూ కేంద్రం దీనిపై నిషేధం విధించింది. బీజీ-3 పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్లైఫోసేట్‌పై నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. పలు రాష్ట్రాలు కూడా కొంతకాలం క్రితమే గ్లైఫోసేట్‌ వాడకాన్ని నియంత్రించాయి. కానీ తెలంగాణ సర్కారు మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. తాజాగా, కేంద్రం ఆదేశాలతో వ్యవసాయ శాఖ నిద్రలేచింది. దీన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీలర్లు గ్లైఫోసేట్‌ను విక్రయించకూడదని ఆదేశించారు. గ్లైఫోసేట్‌పై అధికారికంగా నిషేధం విధించడం వల్ల సాంకేతికంగా సమస్యలు వస్తాయని భావించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరామని.. అయితే ఈ చర్యలన్నీ కూడా నిషేధంగానే ఉంటాయని రాష్ట్ర విత్తన సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు తెలిపారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పురుగుమందుల దుకాణాల్లో గ్లైఫోసేట్‌ లైసెన్సులన్నీ రద్దుకానున్నాయి. విక్రయించేవారిపై కఠిన చర్యలుంటాయని కూడా సర్కారు హెచ్చరించింది. నిషేధిత బీజీ-3 పత్తి పంటలో కలుపు నివారణకు కూడా గ్లైఫోసేట్‌ను ఉపయోగిస్తారు. దీంతో ఈ మందును తెలంగాణలోనూ రైతులు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో చాలా మంది రైతులు బీజీ-3ని సాగుచేశారు. ఇంకొందరు కొనుగోలు చేసి సాగుకు సిద్ధంగా ఉన్నారు. గ్లైఫోసేట్‌తో జీవవైవిధ్యానికి నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దానికి కేంద్రం అనుమతివ్వలేదు. గ్లైఫోసేట్‌ పురుగుమందును బీజీ-3 పత్తికి వేస్తే, పక్కనున్న ఇతర పంటలపైనా ప్రభావం చూపుతుంది. అవి తిన్న ప్రజలపై తీవ్ర ప్రభావం తప్పదు.

Read More
ఇంకెన్ని తూటాలు.. ఇంకెన్ని గాయాలు..
ఇంకెన్ని తూటాలు.. ఇంకెన్ని గాయాలు..
జ‌న‌సేన మోటివేష‌న‌ల్ వీడియో సాంగ్ 

 

జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్బంగా ఓ మోటివేష‌న‌ల్ సాంగ్‌ను రూపొందించింది. మహనీయుల జ్ఞాపకాలను నవతరానికి తెలిపేలా ఓ వీడియో సాంగ్‌ను రూపొందించింది. ‘‘పోరాడి పోరాడి తెచ్చారు స్వతంత్య్రం.. ఎన్నెన్నో త్యాగాలకు గుర్తే ఈ గణతంత్రం. ప్రళయాగ్నికి కాదా గాలి ఆయుధం. ఈ దేశానికి నీ రక్తమేగా ఔషధం. అంటూ సాగిన ఈ పాటను ‘ఇంకెన్ని గాయాలు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన సభా వేదికపై రేపు మధ్యాహ్నం 3 గంటలకు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించనున్నారు. ఈ సభకు సుమారు 4లక్షల మంది హాజరయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More
మహబూబాబాద్ క‌లెక్ట‌ర్‌గా శివ‌లింగ‌య్య‌!
మహబూబాబాద్ క‌లెక్ట‌ర్‌గా శివ‌లింగ‌య్య‌!
మ‌న నిర్మ‌ల్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న సీహెచ్ శివ‌లింగయ్యకు పదోన్న‌తి మీద మహబూబాబాద్ క‌లెక్ట‌ర్ గా బ‌దిలీ అయ్యారు. దాదాపు రెండేళ్లుగా నిర్మ‌ల్ జిల్లా తొలి జాయింట్ క‌లెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్న సీహెచ్‌ శివ‌లింగ‌య్య గ‌త నెల‌లో కేంద్ర డీవోపీటీ ప్రకటించిన ఐఏఎస్ జాబితాలో శివలింగయ్యకు ఐఏఎస్ హోదాను కల్పించారు. ఈ మ‌ధ్యే ఐఏఎస్‌గా ప‌దోన్న‌తి పొందిన శివ‌లింగ‌య్య‌ను తాజాగా మహబూబాబాద్ క‌లెక్ట‌ర్‌గా నియ‌మిస్తూ  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. శివ‌లింగ‌య్య‌తో పాటు మ‌రో ఏడుగురికి బ‌దిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చింది. 
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో నిర్మల్ జిల్లాకు తొలి జాయింట్ కలెక్టర్‌గా నియ‌మితులైన‌ సీహెచ్.శివలింగయ్య.. గ‌తంలో నిర్మ‌ల్ ఆర్డీవోగా ప‌నిచేశారు. శివలింగయ్య నిర్మల్ జిల్లాకే చెందినవారు. భైంసా రెవెన్యూ డివిజన్‌లోని కుంటాల మండలం లింబా(కె) గ్రామవాసి. ఎంఎస్‌సీ, బీఈడీ చదివిన శివలింగయ్య గతంలో పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా భైంసా మండలంలోని చింతల్‌బోరి, నిర్మల్ పట్టణంలోని బాగులవాడ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశారు. 2003లో గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యారు. అప్పుడు ఆర్థిక శాఖలో సహాయ ట్రైజరి అధికారిగా ఎంపికై నిర్మల్‌లోనే పనిచేశారు. అనంతరం మళ్లీ గ్రూప్-1 పరీక్ష రాసి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. నిర్మల్, రంగారెడ్డి, బోధన్ ఆర్డీవోగా, నిజామాబాద్ డ్వామా పీడీగా, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎస్టేట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ క్ర‌మంలో నిర్మ‌ల్ ఆర్డీవోగా ప‌ని చేశారు.
అనతికాలంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుతో నిర్మల్ జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే గ‌త జ‌న‌వ‌రిలో కేంద్ర డీవోపీటీ ప్రకటించిన ఐఏఎస్ జాబితాలో శివలింగయ్యకు ఐఏఎస్ హోదాను కల్పించాగా.. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను మహబూబాబాద్ క‌లెక్ట‌ర్‌గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిర్మల్ జేసీగా పనిచేస్తూ మహబూబాబాద్ క‌లెక్ట‌ర్‌గా ఎంపికైన శివలింగయ్యను జిల్లా అధికారులు, నిర్మల్ జిల్లా ప్రజలు అభినందిస్తుండడంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శివ‌లింగ‌య్య‌ మంత్రిగారికి ఎంతో విధేయుడ‌ని జిల్లా ప్ర‌జ‌లు అంటుంటారు. 
Read More
1 2 3 4 5 >> Last