Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
చెన్నై 'సూపర్' బోణీ
చెన్నై 'సూపర్' బోణీ
రెండేండ్ల నిషేధం తర్వాత తొలిసారి బరిలోకి దిగిన చెన్నైసూపర్ కింగ్స్ సూపర్ బోణీ కొట్టింది. మొద‌టి మ్యాచులోనే చెన్నై టీమ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ ముంబై ఇండ‌యిన్స్ ను మ‌ట్టికరిపించింది. హోరాహోరీగా సాగిన తొలి మ్యాచులో ధోనీటీమ్ వికెట్ తేడాతో ముంబైపై అద్భుత విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అందుకుంది. 84 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై టీమ్‌కు  డ్వేన్ బ్రావో(30 బంతుల్లో 68, 3ఫోర్లు, 7సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఫోర్లు, సిక్స్ ల‌తో ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఓవైపు గాయం వేధిస్తున్నా..లెక్కచేయకుండా కేదార్‌జాదవ్(24 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. 
ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 4 వికెట్ల‌కి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్(43), ఇషాన్‌కిషన్(40), కృనాల్(41 నాటౌట్)తో రాణించారు. ఆ త‌ర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై టీమ్ మొద‌ట్లో క‌ష్ట‌ప‌డ్డా.. బ్రావో అద్భుత‌మైన ఇన్నింగ్స్ కు జాద‌వ్ తోడ‌వ‌డంతో చెన్నై విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మ్యాచులో అర్ధసెంచరీతో జట్టును గెలిపించిన బ్రావోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 
Read More
ఈ సారి ఫ‌స్ట్ గోల్డ్ లేడీ చానునే..
ఈ సారి ఫ‌స్ట్ గోల్డ్ లేడీ చానునే..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం చేసింది. క్రీడలు ప్రారంభమైన తొలి రోజే మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్లో భారత అమ్మాయి సాయిఖోమ్ మీరాభాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది. భారత తరఫున 2018 క్రీడల్లో పాల్గొని తొలి స్వర్ణం నెగ్గిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్‌ చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ తన సత్తా చాటింది. 2014 గ్లాస్గో కామెన్వెల్త్‌ గేమ్స్‌లో రజతంతో సరిపెట్టుకున్న చాను ఈసారి ఏకంగా స్వర్ణానికే గురిపెట్టింది.  మొత్తం 196 కేజీలు ఎత్తిన చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. చాను స్వర్ణం కైవసం చేసుకోగా.. మారిషస్‌కు చెందిన హనిత్రా(170కేజీలు) రజతం గెలుచుకోగా, శ్రీలంకకు చెందిన దినూష(155) కాంస్యంతో సరిపెట్టుకుంది.
23ఏళ్ల చాను భారత రైల్వేలో సీనియర్ టికెట్ చెకర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 194 కేజీలను ఎత్తి జాతీయ రికార్డును నెలకొల్పి స్వర్ణం గెలుచుకొని కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. 22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం. అంత‌కుముందు పురుషుల 56 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గురురాజా రజతం సొంతం చేసుకున్నాడు. భార‌త్‌కు తొలి ప‌త‌కం సాధించాడు.
 
Read More
ఐపీఎల్ 'సాంగ్' భ‌ళా
ఐపీఎల్ 'సాంగ్' భ‌ళా

క‌ల‌ర్‌ఫుల్ ఐపీఎల్ సాంగ్ అభిమానుల‌ను అల‌రిస్తోంది.. 2018 సీజ‌న్ కోసం విడుద‌ల చేసిన ఈ సాంగ్ ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. బెస్ట్ వ‌ర్సెస్ బెస్ట్ పేరుతో రిలీజైన ఈ పాట ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. 1957లో సూప‌ర్ హిట్ అయిన బాలీవుడ్ మూడీ న‌యాదౌర్‌లోని.. యే దేశ్ హై వీర్ జ‌వానో క‌..అనే పాట‌ను ఇన్స్పిరేష‌న్‌గా తీసుకుని ఐపీఎల్ ప్ర‌చార గీతాన్ని రూపొందించారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, బెంగాలీ భాష‌ల్లో విడుద‌లైన ఈ పాట దుమ్మురేపుతున్న‌ది. సౌతాఫ్రికా ద‌ర్శ‌కుడు డాన్ మేస్‌, ముంబై మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజీవ్ వీ భ‌ల్లా ఈ పాట‌ను రూపొందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు. ఐపీఎల్ సాంగ్‌లో ధోనీ, కోహ్లీ, రోహిత్‌, ధ‌వ‌న్ క‌నిపిస్తారు..ధ‌వ‌న్ తొడ‌గొట్ట‌గా, కోహ్లీ సింహంలా గ‌ర్జించ‌గా..సిక్స‌ర్ల మోత మోగిపోతున్న స‌న్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.

">http://

 

Read More
జూనియ‌ర్ అక్ర‌మ్‌ను మీరు చూశారా..!
జూనియ‌ర్ అక్ర‌మ్‌ను మీరు చూశారా..!
ప్ర‌పంచ క్రికెట్‌లో ఎంతో మంది బౌల‌ర్ల‌ను చూసుంటారు.. కానీ, ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌ణికించిన స్వింగ్ సుల్తాన్ వ‌సీం అక్ర‌మ్‌ను ఎవ్వ‌రూ మ‌రిచిపోరు. త‌న కెరీర్‌లో ఎందరో మేటి బ్యాట్స్‌మెన్‌కు వణుకు పుట్టించి పాకిస్థాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిపెట్టాడు. అద్భుతమైన బౌలింగ్ శైలితో పాటు వేగం అంతకుమించిన స్వింగ్‌తో వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (502)తీసిన రెండో బౌలర్‌గా రికార్డులకూ ఎక్కాడు. అతని రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయి బౌలర్ ఇప్పటివరకు పాక్‌కు లభించలేదంటే అతిశయోక్తి కాదేమో.
బుధవారం అక్రమ్.. తన ట్విట్టర్‌లో నిమిషం నిడివి ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో నిండా పదేండ్లు కూడా లేని ఓ పిల్లాడు బౌలింగ్ చేస్తున్న తీరు అక్రమ్, మహ్మద్ ఆమిర్‌ను గుర్తుకు తెస్తున్నది. సింగిల్ వికెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఎడమం చేతితో ఈ కుర్రాడు బంతిని స్వింగ్ చేస్తున్న తీరు చూసేవాళ్లను కట్టిపడేస్తున్నది. 17 బంతులు వేస్తే అందులో ఏడుసార్లు వికెట్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఫైజాన్ రంజాన్ అనే యువకుడు పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారడంతో కుర్రాడి బౌలింగ్‌కు ఫిదా అయిన అక్రమ్ దీనిని షేర్ చేశాడు. ఈ బుడ్డోడు ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పండి. అర్జెంట్‌గా ఆ చిన్నారిని వెతికి పట్టుకోండి. ఇలాంటి నైపుణ్యమే దేశానికి చాలా అవసరం. మన క్రికెట్‌కు భవిష్యత్ ఆశాకిరణం అతను అని ట్వీట్ చేశాడు. దీనిపై అక్రమ్ భార్య షానెరియా బహుశా.. అతను మరో అక్రమేమో అంటూ స్పందించింది.
 
ఆ వీడియోను మీరూ చూడండి
Read More
ఛాహ‌ల్, కుల్దీప్‌ క‌మాల్.. స‌ఫారీలు ఢ‌మాల్‌..
ఛాహ‌ల్, కుల్దీప్‌ క‌మాల్.. స‌ఫారీలు ఢ‌మాల్‌..
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓట‌మి త‌ర్వాత వ‌న్డే సిరీస్‌లో టీమిండియా అద‌ర‌గొడుతోంది. తొలి వ‌న్డేలో సూప‌ర్ విక్ట‌రీ కొట్టిన కోహ్లీగ్యాంగ్.. సెకండ్ వ‌న్డేలోనూ అదే ఫామ్ కొన‌సాగించింది. ముఖ్యంగా స్పిన్న‌ర్లు దుమ్మురేపారు. యంగ్ స్పిన్న‌ర్లు య‌జువేంద్ర ఛాహ‌ల్, కుల్దీప్ యాద‌వ్ స్పిన్ మ్యాజిక్ ముందు స‌ఫారీలు బోల్తా ప‌డ్డారు. మ్యాచ్ మొద‌ట్లోనే ప‌ట్టు సాధించిన భార‌త జ‌ట్టుకు ఈ ఇద్ద‌రు స్పిన్న‌ర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. క్రీజ్‌లోకి వ‌చ్చిన వాళ్లు వ‌చ్చిన‌ట్లే పెవీలియ‌న్ కు పంపారు. ఈ మ్యాచ్ లో ఛాహ‌ల్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యాద‌వ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. మొద‌ట క్వింట‌న్ డికాక్ వికెట్ తీసిన ఛాహ‌ల్.. ఆ త‌ర్వాత జోండో, డుమిని, మోరీస్, మోర్కెల్ వికెట్లు ప‌డ‌గొట్టి త‌న కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్ల మార్క్ ను అందుకున్నాడు. అంతేకాకుండా ఒక ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికాలో ఐదు వికెట్లు తీసిన తొలి భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఈ మ్యాచ్ లో ఛాహ‌ల్ 8 ఓవ‌ర్లు వేసి 22 ప‌రుగులిచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
మ‌రోవైపు ఛాహ‌ల్‌కు తోడు కుల్దీప్ యాద‌వ్ కూడా త‌నదైన స్టైల్ లో బ్యాట్స్ మెన్ ను బోల్తా కొట్టించాడు. స్టాండ్ ఇన్ కెప్టెన్ మార్క్ రామ్ ను సింగిల్ డిజిట్‌కే పెవీలియ‌న్‌కు పంపించిన కుల్దీప్ ఆ త‌ర్వాత వ‌చ్చిన డేవిడ్ మిల్ల‌ర్ ను డ‌కౌట్ చేశాడు. చివ‌ర్లో ర‌బాడాను కూడా ఔట్ చేసి స‌ఫారీల వెన్ను విరిచాడు. వీళ్లిద్ద‌రు క‌లిసి ఎనిమిది వికెట్లు ప‌డ‌గొట్టి స‌ఫారీల బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చారు. దీంతో సౌతాఫ్రికా 117 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 
ఆ త‌ర్వాత బ్యాటింగ్ కి దిగిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ న‌ష్ట‌పోయి టార్గెట్ ను పూర్తి చేసింది. ఓపెన‌ర్ రోహిత్ 15 ప‌రుగులు చేసి ఔట‌వ‌గా.. మ‌రో ఓపెన‌ర్ ధావ‌న్ హాఫ్ సెంచ‌రీతో, కెప్టెన్ కోహ్లీ 46 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన ఛాహ‌ల్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ ల‌భించింది. తాజా విజ‌యంతో 6 మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో భార‌త్ 2-0 తో ఆధిక్యంలో ఉంది.
Read More
చ‌రిత్ర సృష్టించిన కుర్రాళ్లు
చ‌రిత్ర సృష్టించిన కుర్రాళ్లు
- అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ యువ భార‌త్ సొంతం
- నాల్గో సారి వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టు
అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో యువ భార‌త్ చ‌రిత్ర సృష్టించింది.. న్యూజిలాండ్‌లో జ‌రుగుతున్న వ‌రల్డ్ క‌ప్ టోర్నీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం ఇది నాల్గోసారి. 217 ప‌రుగుల టార్గెట్ ను యువ‌ భార‌త్ 39 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసి 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మ‌న్ జోత్ సెంచ‌రీకి తోడు బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించ‌డంతో భార‌త్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా అందుకు తగ్గట్లే ఆడుతూ వచ్చింది. పెద్దగా పోరాడాల్సిన అవసరం లేకుండానే లీగ్, క్వార్టర్స్, సెమీస్‌, ఫైనల్లో  ఈజీగా గెలుపొందింది. ఈ గెలుపుతో అండర్-19 ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు(నాలుగుసార్లు) గెలుపొందిన జట్టుగా భారత్‌ రికార్డు సృష్టించింది. 2000, 2008, 2012, 2018 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. 
అంత‌కుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ జ‌ట్టు 216 ప‌రుగుల‌కి ఆలౌటైంది. బౌల‌ర్లంతా స‌మిష్టి రాణించారు. పొరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్‌ మావి ఓ వికెట్‌ తీశాడు. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో జోనాథన్‌ మెర్లో(76;102 బంతుల్లో 6 ఫోర్లు) మినహా ఎవరూ హాఫ్‌ సెంచరీ మార్కును చేరలేదు. పరమ్‌ ఉప్పల్‌(34),జాక్‌ ఎడ్వర్డ్స్‌(28), నాథన్‌ మెక్‌ స్వీనీ(23)లు ప‌ర్వాలేద‌నిపించారు. 
ఆ త‌ర్వాత బ్యాటింగ్ కి దిగిన టీమిండియాకు ఓపెనర్లు పృథ్వీషా, మన్‌జోత్‌ కర్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.4 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యం సాధించి పటిష్ట స్థితికి చేర్చారు. పృథ్వీ షా(21) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ మిగతా పనిని మన్‌జోత్‌ కల్రా(101 నాటౌట్‌;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్విక్‌ దేశాయ్‌(47 నాటౌట్ తో పూర్తి చేశారు. శుభ్‌మాన్‌ గిల్‌(31) ఆకట్టుకున్నాడు. దీంతో భార‌త జ‌ట్టు 38.5 ఓవ‌ర్ల‌లో టార్గెట్ ను పూర్తి చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఫైన‌ల్‌లో సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడిన మ‌న్ జోత్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ కైవ‌సం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఒక సెంచ‌రీ, 3 హాఫ్ సెంచ‌రీల‌తో 372 ర‌న్స్ చేసిన శుభ్ మ‌న్ గిల్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ల‌భించింది.
Read More
1 2 3 4 5 >> Last