Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
స్కూల్ బ‌స్ కింద ప‌డి చిన్నారి మృతి
స్కూల్ బ‌స్ కింద ప‌డి చిన్నారి మృతి

- డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటున్న కుటుంబికులు
- పోలీసుల అదుపులో డ్రైవ‌ర్‌

రోజ‌టి లాగే పాఠ‌శాల‌కు బ‌య‌ల్దేరి ఇంటికి వ‌స్తున్నఓ చిన్నారి.. తిరిగిరాని లోకాల‌కు వెళ్లింది. ఎప్ప‌టిలాగే స్కూల్‌ బ‌స్ లో వెళ్లే ఆ చిన్నారిని ఆ బ‌స్సే చిదిమేసింది. స్కూల్ బ‌స్ కింద ప‌డి మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్మల్‌ ప‌ట్ట‌ణంలోని సోఫీన‌గ‌ర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే ప‌ట్ట‌ణంలోని సోఫినగర్‌కు చెందిన సంతోశ్‌, చరిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. తండ్రి వృత్తిరీత్యా పెయింటింగ్‌ పనులు నిర్వహిస్తుండగా, తల్లి బీడీ కార్మికురాలు. వారి కూతురు సాన్విక(4) సమీపంలోని కృష్ణవేణి పాఠశాలలో నర్సరీ చదువుతోంది. రోజూ పాఠశాలకు చెందిన బస్సులోనే వెళ్లి వస్తుంటుంది. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం సైతం పాఠశాల బస్సులో (టీఎస్‌01యూఏ- 5950) ఇంటికి వచ్చిన బాలిక బస్సు దిగుతున్న సమయంలో కిందపడింది.

వాహనం వెనక చక్రాల కిందపడటంతో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో బస్సును అక్కడే నిలిపేశారు. ఈలోపు అపస్మారకస్థితికి చేరుకున్న బాలికను హుటాహుటీన ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందిందని చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉండటం చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. డ్రైవ‌ర్‌ నరేశ్‌ అజాగ్రత్తగా బస్సు నడపడంతో చిన్నారి మృత్యువాత పడిందని తెలుస్తోంది. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పట్టణ సీఐ జాన్‌ దివాకర్‌ తెలిపారు.

 

Read More
పాక్‌కో ఖతం కర్‌దో!
పాక్‌కో ఖతం కర్‌దో!

- మూకుమ్మడిగా నినదించిన నిర్మల్‌ జిల్లా యువత
- ప్రతీకారం తీర్చుకోవాలంటూ పాక్‌ దిష్టిబొమ్మలు దగ్ధం
- భైంసా, నిర్మల్‌ సహా పలుచోట్ల క్యాండిల్‌ ర్యాలీలు
- పాఠశాలల్లోనూ చిన్నారుల కన్నీటి నివాళి
- అమరవీరులకు బీజేపీ, ఏబీవీపీ శ్రద్ధాంజలి

పుల్వామా ఘటనతో యావద్భారతంలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ భావనతో.. చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ రోడ్లెక్కారు. అమరవీరులకు క్యాండిల్‌ ర్యాలీలతో ఘననివాళుర్పిస్తూనే.. పాక్‌పై, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారతసేనలు ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. పలుచోట్ల పాఠశాలల్లో చిన్నారులు అమరజవాన్లకు నివాళులర్పించిన చిత్రాలు కన్నీరు తెప్పించాయి. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే..

CRPF జవాన్లపై జైషే మహ్మద్ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ దాడిని నిరసిస్తూ.. బీజేవైఎం నిర్మల్‌ శాఖ ఆధ్వర్యంలో పాకిస్తాన్‌ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్‌, అసెంబ్లీ కన్వీనర్ అనుముల శ్రవణ్, పట్టణ అధికార ప్రతినిధి దశరథ్ పోశెట్టి, పట్టణ అధ్యక్షుడు మంత్రి శివ, దిలవార్‌పూర్‌ ఉపసర్పంచ్‌ రాజేశ్వర్‌ రెడ్డి, ఇతర సీనియర్‌నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలోనూ క్యాండిల్‌ ర్యాలీ జరిగింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Basar

భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదం అంతుచూడాలని నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సరస్వతీ క్షేత్రమైన బాసర్‌లోనూ అమరజవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ్‌ (తాపస్‌), పలు స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

నిర్మల్ బంగల్‌పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమర జవాన్లకు అశృనివాళి అర్పించారు. బోర్డుపై అమరజవాన్లకు నివాళి అని రాసి.. జాతీయ పతాకాన్ని ఉంచి నివాళుర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అమర జవాన్ల స్మృతి చిహ్నానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఉపాధ్యాయులు దేశ రక్షణలో సైనికుల పాత్రను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంనరేష్‌, సాయన్న, జ్యోతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

రాత్రి నిర్మల్‌లోని వివేకానంద చౌక్‌ వద్ద ‘స్ఫూర్తి నిర్మాణ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ సహా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. 

అమరజవాన్లకు మననిర్మల్‌.కామ్‌ ఘననివాళి
ఇలాంటి ఘటనలు జరిగినపుడు మాత్రమే మన దేశభక్తిని ప్రదర్శించేందుకు రోడ్లపైకి రావాలని అనుకోవద్దు. 
జవాన్ల సేవలను నిత్యం గుర్తుచేసుకుంటూ.. దేశ రక్షణలో మన బాధ్యతను గుర్తెరిగి సమాజశ్రేయస్సులో భాగం కావాలని కోరుతున్నాం.
 

 

Read More
నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ చీఫ్‌గా రామారావ్‌
నిర్మల్‌ జిల్లా కాంగ్రెస్‌ చీఫ్‌గా రామారావ్‌

నిర్మల్‌ జిల్లాకాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల ముథోల్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి పవార్‌ రామారావ్‌ పటేల్‌ను నియమిస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మహేశ్వర్‌ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. ఇందుకు కారణాలు తెలియరాలేదు. తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఆదిలాబాద్‌ జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌గా యువనాయకుడు భార్గవ్‌ దేశ్‌పాండేను నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

జిల్లాల అధ్యక్షుల జాబితా:
భార్గవ్‌ దేశ్‌పాండే - ఆదిలాబాద్, 
కొక్కిరాల సురేఖ - మంచిర్యాల, 
రామారావు పటేల్‌ పవార్‌ - నిర్మల్, 
ఆత్రం సక్కు - కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్
కె.మృత్యుంజయం - కరీంనగర్
ఎ.లక్ష్మణ్‌కుమార్‌ - జగిత్యాల
ఈర్ల కొమురయ్య - పెద్దపల్లి
ఎన్‌.సత్యనారాయణ గౌడ్‌ - రాజన్న సిరిసిల్ల
ఎం.మోహన్‌రెడ్డి - నిజామాబాద్
కైలాష్‌ శ్రీనివాస్‌రావు - కామారెడ్డి
నాయిని రాజేందర్‌రెడ్డి - వరంగల్‌
గండ్ర జ్యోతి - జయశంకర్‌ భూపాలపల్లి
జంగా రాఘవరెడ్డి - జనగామ
నిర్మలా గౌడ్‌ - సంగారెడ్డి
తిరుపతి రెడ్డి - మెదక్
టి.నర్సారెడ్డి - సిద్దిపేట
పైలట్‌ రోహిత్‌రెడ్డి - వికారాబాద్, 
కూన శ్రీశైలం గౌడ్‌ - మేడ్చల్‌, మల్కాజిగిరి
చల్లా నరసింహారెడ్డి - రంగారెడ్డి
ఒబేదుల్లా కొత్వాల్‌ - మహబూబ్‌నగర్
శంకర్‌ ప్రసాద్‌ - వనపర్తి
పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి - జోగులాంబ గద్వాల
డాక్టర్‌ సీహెచ్‌ వంశీకృష్ణ - నాగర్‌ కర్నూలు
సీహెచ్‌ వెంకటన్న యాదవ్‌ - సూర్యాపేట
బి.భిక్షమయ్య గౌడ్‌ - యాదాద్రి భువనగిరి
జె. భరతచంద్రారెడ్డి - మహబూబాబాద్
కె.శంకర్‌ నాయక్‌ - నల్గొండ
వనమా వెంకటేశ్వరరావు - భద్రాద్రి కొత్తగూడెం
పువ్వాడ దుర్గాప్రసాద్‌ - ఖమ్మం

సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు:
గ్రేటర్‌ హైదరాబాద్‌ - ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్, 
వరంగల్‌ సిటీ - కేదారి శ్రీనివాసరావు 
నిజామాబాద్‌ సిటీ - కేశ వేణు
ఖమ్మం సిటీ - జావీద్‌.
వీరితోపాటు ఖమ్మం సిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్‌.దీపక్‌ చౌదరిని నియమించారు. 

Read More
ఘనంగా వివేకానంద జయంతి
ఘనంగా వివేకానంద జయంతి

- నిర్మల్‌ యువతలో తొణికిసలాడిన ఉత్సాహం
- వరుసగా నాలుగో ఏడాదీ విజయవంతంగా 2కే రన్‌

వరుసగా నాలుగో ఏడాది మననిర్మల్.కామ్ (mananirmal.com) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా జరిగింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన 2కే రన్ (సమగ్రతా పరుగు) లో నిర్మల్‌ యువత ఉత్సాహంగా పాల్గొంది. ఎన్టీఆర్‌ స్టేడియంలో స్ఫూర్తి నిర్మాణ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, మననిర్మల్‌.కామ్‌ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. శనివారం ఉదయం 8.30కు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు 2కే రన్‌ను ప్రారంభించారు. పోటీతత్వం పెరిగిన నేటి సమాజంలో అన్ని అవరోధాలను దాటుకొని యువత ముందుకెళ్లాలంటే వివేకానందుని బోధనలను పాటించడం అత్యంత అవసరమని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్ముడు చేసిన కృషి ఎలాగైతే మరువలేమో.. ప్రపంచం ప్రపంచశాంతి, సర్వ మానవ సౌభ్రాతృత్వంతో పాటు.. దేశ సమగ్రత, యువత ఐక్యత కోసం వివేకానందుడు చేసిన ప్రయత్నాన్ని కూడా విస్మరించలేమన్నారు. దేశం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకుని.. నవభారత నిర్మాణం కోసం యువత దూసుకు పోవాలంటే వివేకానందుడి ఆలోచనలే సరైన దిక్సూచి అని ఆయన పేర్కొన్నారు. జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి ముత్తన్న మాట్లాడుతూ.. దేశానికి, ధర్మానికి ఐకాన్‌ అయిన వివేకానందుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 

వివేకానందుడికి పాలాభిషేకం
రన్‌ ప్రారంభానికి ముందు పాతబస్టాండ్‌లోని వివేకానంద విగ్రహానికి ఎస్పీ శశిధర్‌ రాజు ప్రభృతులు పాలాభిషేకం చేశారు. అనంతరం జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. అక్కడినుంచి శివాజీ చౌక్‌ వరకు తిరిగి.. ఎన్టీఆర్‌ స్టేడియం వరకు రన్‌ కొనసాగింది. 300 మంది యువకులు ఈ సమగ్రతా పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం.. నిర్మల్‌ పట్టణంలో సేవాకార్యక్రమాలు చేపడుతున్న వివిధ స్వచ్ఛంద సంస్థలకు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సత్కరించింది. వీరితోపాటుగా ఇటీవలి కాలంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు గండ్రత్‌ ఈశ్వర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్  అధ్యక్షుడు వెంకటేశ్వరరావు,  మననిర్మల్.కామ్, స్ఫూర్తి నిర్మాణ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, వాకర్స్ అసోసియేషన్, యువజన సంఘాల కార్యకర్తలు, హిందుస్థాన్ క్రికెట్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. అనంతరం వెన్నెల డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి నిర్మాణ్‌ సంస్థ అధ్యక్షుడు అంగ జగదీష్, కార్యదర్శి శ్రవణ్, శశిరాజ్, ట్రెజరర్‌ అనిల్‌ కుమార్‌, సాయి ప్రసాద్, కందుల మహేష్, మననిర్మల్‌.కామ్‌ డిప్యూటీ ఎడిటర్‌ శ్రవణ్‌ కుమార్‌, సంతోష్‌, సందేశ్‌, అఖిల్‌, పవన్‌ తదితరులు క్రియాశీలకంగా వ్యవహరించారు.

Read More
ప్ర‌జా సేవ‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి
ప్ర‌జా సేవ‌లో అంద‌రూ భాగ‌స్వామ్యం కావాలి

- నిర్మ‌ల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 
- ఘ‌నంగా ప్ర‌జా వికాస స‌మితి మొద‌టి వార్షికోత్స‌వం

ప్ర‌జా వికాస స‌మితి మొద‌టి వార్షికోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని స‌మితి స‌భ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కలిశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం అందించి స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా ఐకే రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జా వికాస స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు. స‌మాజ సేవ చేస్తూ అభివృద్ధిలో భాగ‌స్వామ్యం కావాల‌ని స‌మితి స‌భ్యుల‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రజావికాస స‌మితి నిర్మ‌ల్ జిల్లా అధ్య‌క్షుడు రాజుల‌దేవి శ్రీనివాస్‌, కార్య‌ద‌ర్శి సుబ్ర‌హ్మ‌ణ్యం, తాడిచెట్ల ప్ర‌భాక‌ర్‌, అనుముల భాస్క‌ర్‌, స్థానిక కౌన్సిలర్ ఆకోజి కిష‌న్ పాల్గొన్నారు.
 

Read More
ఈ ఎన్నిక‌ల్లో నిరంత‌ర నిఘా
ఈ ఎన్నిక‌ల్లో నిరంత‌ర నిఘా

- భారీగా ప‌ట్టుబ‌డ్డ న‌గ‌దు, మ‌ద్యం
- జిల్లా ఎస్పీ సి.శ‌శిధ‌ర్‌రాజు

ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక పోలీసు బృంధాల‌తో నిరంత‌ర నిఘాను ఏర్పాటుచేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా ఎస్పీ సి.శశిధ‌ర్‌రాజు అన్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జిల్లా ఎస్పీ విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిర్మ‌ల్ జిల్లాలో ఇప్పటి వ‌ర‌కు రూ.58 ల‌క్ష‌ల న‌గ‌దు పట్టుకోవ‌డం జ‌రిగింద‌ని, అలాగే 5152 లీట‌ర్ల మ‌ద్యం, రూ.21 ల‌క్ష‌ల 94 వేల విలువ‌గ‌ల అక్ర‌మ మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. జిల్లాలో 493 సాధార‌ణ పోలింగ్ కేంద్రాలు ఉండ‌గా, స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాలు 118, న‌క్స‌ల్స్ ప్ర‌భావిత పోలింగ్ కేంద్రాలు 8 తో మొత్తం 619 పోలింగ్ కేంద్రాలున్నాయ‌ని పేర్కొన్నారు. జిల్లాలో పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు 64 రూట్ మొబైల్ పార్టీలు, 20 స్ట్రైకింగ్ ఫోర్స్ బృంధాలు, స్టాటిక్ స‌ర్వేలేసు టీమ్‌లు 15, ఫ్ల‌యింగ్‌స్క్వాడ్ 15 బృంధాలతోపాటు బుధ‌వారం రాత్రి నుండి 15 ప్ర‌త్యేక పోలీసు బృంధాలు నిరంత‌ర నిఘా కోసం పెట్రోలింగ్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అలాగే 5 కంపెనీల కేంద్ర బ‌ల‌గాలు, 500 మంది మ‌హారాష్ట్ర పోలీసుల‌తో స‌హా మొత్తం 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా ఎస్పీ శ‌శిధ‌ర్‌రాజు తెలిపారు. 

Read More
1 2 3 4 5 >> Last