Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
గ‌ర్భిణీల‌కు పోష‌కాహారం అందేలా చూడాలి
గ‌ర్భిణీల‌కు పోష‌కాహారం అందేలా చూడాలి

అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కు క‌లెక్ట‌ర్ సూచ‌న‌
గ‌ర్భిణీల‌కు, శిశువుల‌కు మెరుగైన పౌష్టికాహారం అందేలా చూడాల‌ని అంగ‌న్‌వాడీ టీచ‌ర్లకు జిల్లా క‌లెక్ట‌ర్‌ ఎం.ప్ర‌శాంతి సూచించారు. బుధ‌వారం వైయ‌స్ఆర్ ఫంక్ష‌న్‌హాల్‌లో మ‌హిళ‌, శిశుసంక్షేమ‌శాఖ ఆద్వ‌ర్యంలో జిల్లాస్థాయి పోష‌ణ అభియాన్‌, సంబంధిత‌శాఖ‌ల స‌మ‌న్వ‌య స‌మావేశం, శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ ముఖ్య అథితిగా హాజ‌రై మాట్లాడారు. రాష్ట్ర‌, కేంద్ర స్థాయిలో అన్నిశాఖ‌ల స‌మ‌న్వ‌యంతో 9 వేల కోట్ల రూపాయ‌ల‌తో గ‌ర్భిణీలు, శిశువుల‌కు పౌష్టికాహారం అందించేందుకు పోష‌ణ్ అభియాన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్నారు. జిల్లాలో సెప్టెంబ‌ర్ నెల‌లో ఇంటింటా పోష‌ణ సంబ‌రాలు పంచాయ‌తీరాజ్‌, ఐసీడీయ‌స్‌, వైద్య‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్‌, విద్యాశాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

ప్ర‌తీ గ్రామంలో మ‌రుగుదొడ్లు, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, శిశుమ‌ర‌ణాల త‌గ్గింపు, ఐర‌న్ విట‌మిన్లు గ‌ల పోష‌కాహారం, శుద్ద‌మైన తాగునీరు అందేలా చూడాల‌న్నారు. స‌రైన స‌మ‌యంలో ఇంటింటికి వెళ్లి గ‌ర్భిణీల‌ను, శిశువుల‌ను ప‌రిశీలించి పిల్ల‌ల బ‌రువును కార్డులో న‌మోదు చేయాల‌న్నారు. అలాగే ఆశా కార్య‌క‌ర్త‌లు గ‌ర్భ‌వ‌తుల‌ను ఖ‌చ్చితంగా ఆసుప‌త్రుల‌లోనే ప్ర‌స‌వం అయ్యేలా చూడాల‌ని, స‌రైన స‌మ‌యంలో న‌వ‌జాత శిశువుల‌కు టీకాలు వేయించాల‌న్నారు. పౌష్టికాహారం గుడ్లు, పాలు, వేడివేడి అన్నం అందించాల‌న్నారు. గ‌ర్భిణీలు అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు వ‌చ్చేలా చూడాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ప్ర‌శాంతి గ‌ర్భిణీల‌కు శ్రీ‌మంతం, చిన్న‌పిల్ల‌ల‌కు అన్న‌ప్రాస‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా మ‌హిళా శిశు సంక్షేమ అధికారి విజ‌య‌ల‌క్ష్మీ, జిల్లా పంచాయ‌తీ అధికారి శ్రీ‌నివాస్‌, ఇమ్యునైజేష‌న్ అధికారి డాక్ట‌ర్ కార్తిక్‌, బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి స‌గ్గం రాజు, రాజేశ్వ‌ర్‌, సీడీపీవో శిరీష‌, ఛాయ‌, వెంక‌ట‌ర‌మ‌ణ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Read More
స‌త్ర్ప‌వ‌ర్త‌న‌తోనే ఆరోగ్యం
స‌త్ర్ప‌వ‌ర్త‌న‌తోనే ఆరోగ్యం

- ఆరోగ్య తెలంగాణ కోస‌మే ప్ర‌భుత్వం కృషి
- రాష్ట్ర గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి


ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కృషిచేస్తుంద‌ని రాష్ట్ర న్యాయ‌, గృహ‌నిర్మాణ‌, దేవాదాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని వ‌శిష్ట పాఠ‌శాల‌లో ఏర్పాటుచేసిన ఉచిత ఆయూష్ మెగా వైద్య శిభిరంలో మంత్రి ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతిప్ర‌జ్వ‌ల‌నగావించి వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య‌మే మ‌హాభాగ్యమ‌ని, ప్ర‌తీ ఒక్క‌రు త‌మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌న్నారు. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తీ ఒక్క‌రు ప్ర‌తీ ఒక్క‌రు పాటుప‌డాల‌న్నారు. ప్ర‌జ‌ల జీవ‌న‌శైలిలో లోపం మ‌నం అనేక వ్యాధులబారిన ప‌డుతున్నామ‌న్నారు. ప్ర‌తీ వ్య‌క్తి క‌నీసం 45 నిమిషాల‌పాటు న‌డ‌వాల‌న్నారు.

ప్లాస్టిక్ వ‌ల్ల అనారోగ్యానికి గుర‌వుతున్నార‌ని, అవి  వాడ‌కుండా చూడాల‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కై ఎన్నో కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌లుక ఆరోగ్య‌శ్రీ‌, హెల్త్‌కార్డులు, ప్ర‌తీ ఒక్క‌రికి కంటి ప‌రీక్ష‌లు నిర్వహించ‌నుంద‌ని మంత్రి తెలిపారు. ఆయూశాఖ అడిషిన‌ల్ డైరెక్ట‌ర్ మూర్తి మాట్లాడుతూ బిహేవియ‌ర్ ఛేంజ్ క‌మ్యూనికేష‌న్ స‌త్ర్ప‌వ‌ర్త‌న ఆరోగ్యం కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల జీవ‌నశైలిలోని లోపాల వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల‌ను వారి ప్ర‌వ‌ర్త‌న మార్చ‌డం ద్వారా మార్పుతీసుకురావ‌చ్చ‌ని, దీంతో ఆరోగ్య‌వంత‌మైన స‌మాజంను తీర్చి దిద్దటం జ‌రుగుతుంద‌న్నారు. ఈ స‌మావేశంలో ఆయూష్ అద‌న‌పు సంచాల‌కులు డాక్ట‌ర్ మురాద్ అలీ, మున్సిప‌ల్ ఛైర్మెన్ గ‌ణేష్ చ‌క్ర‌వ‌ర్తి, గ్రంథాల‌య చైర్మెన్ రాజేంధ‌ర్‌, జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి క‌న్వీన‌ర్ వెంకట్‌రాంరెడ్డి, పాకాల రాంచంద‌ర్‌, డాక్ట‌ర్లు ర‌వీంధ‌ర్‌రెడ్డి, కేదారి, విజ‌య్‌కుమార్‌, ఫ‌రీదాబేగం, కౌన్సిల‌ర్ కిష‌న్‌, ధ‌ర్మాజి రాజేంధ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read More
క్ష‌య‌వ్యాధిని అంతంచేద్దాం
క్ష‌య‌వ్యాధిని అంతంచేద్దాం

- జిల్లా వైద్య‌, ఆరోగ్య‌శాఖ అధికారి జ‌ల‌ప‌తినాయ‌క్‌
 


నిర్మ‌ల్ జిల్లాలో క్ష‌య‌వ్యాధిని అంతం చేసేందుకు ప్ర‌తీ ఒక్క‌రు త‌మ‌వంతు బాధ్య‌త‌గా కృషిచేయాల‌ని జిల్లా వైద్య‌, ఆరోగ్య‌శాఖ అధికారి జ‌ల‌ప‌తినాయ‌క్ అన్నారు. శ‌నివారం ప్ర‌పంచ టీబీ(క్ష‌య‌) నివార‌ణ దినోత్స‌వంను పుర‌స్క‌రించుకుని స్థానిక వై ఎస్ ఆర్ ఫంక్ష‌న్‌హాల్ నిర్వ‌హించిన స‌ద‌స్సుకు ఆయ‌న ముఖ్య అథితిగా హాజ‌రై మాట్లాడారు.  గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు టీబీ వ్యాధి గురించి ఆశావ‌ర్క‌ర్లు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నార‌న్నారు. టీబీ వ్యాధి సూక్ష్మ‌క్రిముల ద్వ‌రా సంక్ర‌మించునని, రోగి ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు క్రిముల ద్వారా, తుంప‌ర్ల ద్వారాగాని గాలిలో ఆరోగ్య‌వంతులు పీల్చిన‌ప్పుడు  వారికి కూడా టీబీ వ్యాధి సోకే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అందుకుగాను ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. రెండు వారాల‌కు మించి ద‌గ్గు, బ‌రువు, సాయంత్రంపూట జ్వ‌రం, ఆక‌లి ఉండ‌క‌పోవ‌డం, ఛాతిలో నొప్పి, ద‌గ్గిన‌ప్పుడు ర‌క్తం రావ‌డం టీబీ యొక్క ల‌క్ష‌ణాల‌న్నారు. తెమ‌డ ప‌రీక్ష‌లు చేయ‌డం ద్వారా టీబీ నిర్ధారించ‌వ‌చ్చ‌న్నారు. అంత‌కుముందు ప్ర‌సూతి ఆసుప‌త్రి నుండి వై ఎస్ ఆర్ ఫంక్ష‌న్‌హాల్ వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

జిల్లా ఏరియా ఆసుప‌త్రి సూప‌రిండెంట్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ‌లో బాగంగా ఆరోగ్య తెలంగాణ కావాల‌ని, ఇందుకు ప్ర‌తీ ఒక్క‌రు కృషివ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. జిల్లా క్ష‌య‌వ్యాధి నివార‌ణ అధికారి డాక్ట‌ర్ కార్తీక్ మాట్లాడుతూ టీబీ వ్యాధి గురించి అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. టీబీ వ్యాధిగ్ర‌స్థులు అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఒక గుడ్డుకు రెండు గుడ్లు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. వ్యాదిగ్ర‌స్తుల ఇండ్ల‌కు వెళ్లి ఉచితంగా మందులు ఇవ్వ‌డ‌మే కాకుండా వారు తీసుకునే జాగ్ర‌త్త‌ల‌ను ఆశాకార్య‌క‌ర్త‌లు వివ‌రిస్తున్నార‌ని తెలిపారు. టీబీ వ్యాధిని అరిక‌ట్టేందుకు అత్యాధునిక వైద్య సేవ‌లు అందుబాటులో ఉన్నాయ‌ని, టీబీ ప్రాథ‌మిక స్థాయిలో గుర్తిస్తే నివార‌ణ అత్యంత సులువ‌ని పేర్కొన్నారు. టీబీ వ్యాధిపై విద్యార్థులు, ఆశావ‌ర్క‌ర్లు, ఏఎన్ఎంలు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహన క‌ల్పించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్‌, డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌, ల‌క్ష్మ‌ణ్‌, ఆర్టీసీ స్టేష‌న్ మేనేజ‌ర్ రాజేశ్వ‌ర్‌, డీపీయంఓ జ‌య‌ప్ర‌మోద్‌, డీపీయంహెచ్ఓ, ఆశావ‌ర్క‌ర్లు, విద్య‌ర్థులు పాల్గొన్నారు.

Read More
నులిపురుగులను న‌లిపేద్దాం
నులిపురుగులను న‌లిపేద్దాం
- ఆశ్ర‌మ పాఠ‌శాల‌లో విద్యార్థినీల‌కు మాత్ర‌ల‌ పంపిణీ 
- పాల్గొన్న మంత్రి ఐకే రెడ్డి, మునిసిప‌ల్ చైర్మ‌న్‌
ఆరోగ్యక‌ర‌ సమాజ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది రెండుసార్లు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని అన్నారు రాష్ట్ర దేవాదాయ‌, గృహ నిర్మాణ‌, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల‌నేదే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని అన్నారు. శుక్ర‌వారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ బాలిక‌ల‌ ఆశ్ర‌మ పాఠ‌శాలలో నిర్వ‌హించిన జాతీయ నులిపురుగుల నిర్మూల‌న దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి మంత్రి ఐకే రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా, వైద్యంపై కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల‌నే ధ్యేయంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆసుప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థినీల‌కు మంత్రి ఐకే రెడ్డి నులిపురుగుల నిర్మూల‌న మాత్ర‌ల‌ను అందించారు. 
జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1 నుంచి 19 సంవత్సరాలలోపు వయస్సు వారికి అల్బెండజోల్‌ మాత్రలు వేసేందుకు చర్యలు చేపట్టామ‌ని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రలు వేయనున్నారని అన్నారు. మాత్రలు వేసుకోవడం ద్వారా చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదల పెరుగుతుంది. మాత్రల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మునిసిప‌ల్ చైర్మ‌న్ అప్పాల గ‌ణేష్‌,ఆర్డీవో ప్ర‌సూనాంబ‌,నాయ‌కులు రాంకిష‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
Read More
అత్యాధునిక వైద్య‌సేవ‌లతో విజ‌య హాస్పిట‌ల్‌
అత్యాధునిక వైద్య‌సేవ‌లతో విజ‌య హాస్పిట‌ల్‌
నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక వైద్య ప్ర‌మాణాల‌తో వైద్య‌సేవ‌లందించ‌డానికి విజ‌య హాస్పిట‌ల్‌ను వసంత‌పంచ‌మి సోమ‌వారం నాడు ప్రారంభించామ‌ని డాక్ట‌ర్ మ‌ల్లికార్జున్‌రెడ్డి అన్నారు. ఈ ప్రారంభోత్స‌వానికి  ముఖ్య అథితులుగా హైద‌రాబాద్‌కు చెందిన సాయి సంజీవ‌ని హాస్పిట‌ల్ డాక్ట‌ర్ అంజ‌య్య (ఎం.ఎస్‌. ఆర్థో) , క‌రీంన‌గ‌ర్‌కు చెందిన డాక్ట‌ర్ మోతీలాల్ (ఎం.ఎస్‌.ఆర్థో) ఆర్థోపెడిక్ ప్రొఫెస‌ర్‌, సికింద్రాబాద్ య‌శోధ ఆసుప‌త్రి డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ (ఎం.ఎస్‌. ఆర్థో), డాక్ట‌ర్ హ‌రీష్‌లు హాజ‌ర‌య్యారు. ముందుగా వారు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌చేసి ఆసుప‌త్రిని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ మ‌ల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్ర‌జ‌లు హైద‌రాబాద్ లాంటి దూర ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా ఇప్పుడు మ‌న నిర్మ‌ల్‌లోనే అత్యాధునిక వైద్యప్ర‌మాణాల‌తో వైద్య‌సేవ‌లందించ‌డానికి ముందుకు వ‌చ్చామ‌న్నారు. ఆసుప‌త్రిలో డాక్ట‌ర్లు శ్రీ‌జ శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, న‌ళిని ర‌ఘునంద‌న్‌రెడ్డిలు మోకాలు కీలు మార్పిడి, ఇత‌ర ఆర్థోపెడిక్ శ‌స్త్ర చికిత్స‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. 
ఆసుప్ర‌తిలో అన్నిహంగుల‌తో నూత‌న వైద్య ప‌రిక‌రాల‌ను అందుబాటులో ఉంచి వైద్య సేవ‌లందిస్తామ‌న్నారు. హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాల్లో అందించే వైద్య చికిత్స‌లు ఇప్పుడు మ‌న నిర్మ‌ల్‌లోని విజ‌య హాస్పిట‌ల్‌లో అందించ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. 24 గంట‌ల‌పాటు  వైద్యులు అందుబాటులో ఉంటార‌ని పేర్కొన్నారు. ఈ వైద్య చికిత్స‌ల‌ను రోగులు స‌ద్వినియోగం చేసుకుని వారి ఆరోగ్యాల‌ను కాపాడుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మ‌ల్ ఏరియా ఆసుపత్రి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ సురేష్‌, డాక్ట‌ర్‌లు వెంక‌ట్‌రావు, నాగేశ్వ‌ర్‌రావు, ధూమ్‌సింగ్‌, ర‌జిని, ముర‌ళీకృష్ణ‌, కాశీనాథ్‌, దామెర‌రాములు, ప్ర‌భాక‌ర్‌రావు, ప్ర‌మోద్ చంద్రారెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.
Read More
ఆద‌ర్శ‌న‌గ‌ర్‌లో అక్యూప్రెష‌ర్ వైద్య‌శిబిరం
ఆద‌ర్శ‌న‌గ‌ర్‌లో అక్యూప్రెష‌ర్ వైద్య‌శిబిరం

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని ఆద‌ర్శ‌న‌గ‌ర్‌లో మంగ‌ళ‌వారం ఛ‌త్ర‌ప‌తి శివాజీ సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ప‌డిగెల భూమ‌వ్వ ఫంక్ష‌న్‌హాల్‌లో వైద్యశిబిరం ప్రారంభ‌మైంది. ఈ వైద్య‌శిబిరం ఉద‌యం 8 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు, మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం 4 గంట‌ల నుండి సాయంత్రం 8 గంట‌ల వ‌ర‌కు 7 రోజుల‌పాటు కొన‌సాగ‌నుంద‌ని సేవాస‌మితి జిల్లా అధ్య‌క్షులు మెడిసెమ్మ రాజు, దేవ‌ర‌కోట ఆల‌య చైర్మన్ ఆమెడ కిష‌న్‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ శ‌రీరంలోని ఏ భాగ‌మైన అనారోగ్యానికి గురైన‌ప్పుడు మ‌న అర‌చేతిలోను, అరికాళ్ల‌లోని భాగాల‌ను డాక్ట‌ర్లు గుర్తించి వైద్యం అందిస్తార‌న్నారు. దీని ద్వారా వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ వైద్య చికిత్స‌లు అక్యుప్రెష‌ర్ డాక్ట‌ర్ క‌విత‌, డాక్ట‌ర్ పంక‌జ్‌రాజ్ పురోహిత్‌ల వైద్యబృందం అందిస్తుంద‌ని వివ‌రించారు. ఊబ‌కాయం, అతిమూత్రం, ర‌క్త‌పోటు, ప‌క్ష‌వాతం, మ‌ధుమేహం, ఆస్త‌మా, మూత్ర‌పిండంలో రాళ్లు, మెడ‌నొప్పి, న‌డుమునొప్పి, మోకాళ్ల నొప్పుల‌కు మందులు వాడ‌కుండా చికిత్స‌లు అందిస్తార‌ని పేర్కొన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో మాజీ జ‌డ్పీ చైర్మన్ జుట్టు అశోక్‌, డాక్ట‌ర్ కృష్ణంరాజు, గురుస్వామి చెనిగార‌పు చిన్న‌య్య‌, సేవాస‌మితి కార్య‌ద‌ర్శి పాత‌ర్ల హ‌రీష్‌, శాంతిలాల్ పటేల్‌, మ‌ర్కంటీ జీవ‌న్‌, జిల్లా ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి శివ అన్వేష్‌, పొలిశెట్టి విలాస్‌, రాజారాం, డాక్ట‌ర్ పంక‌జ్ క‌విత‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.
Read More
1 2 3 4 >> Last