Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
అవ‌కాశాలు అందిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధి
అవ‌కాశాలు అందిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధి
- నిర్మ‌ల్‌లో జాబ్ మేళాకు అపూర్వ స్పంద‌న‌
- నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకే జాబ్ మేళా
- ఏబీఆర్ ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కురాలు డాక్ట‌ర్ స్వ‌ర్ణా రెడ్డి
నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్‌మేళాను నిర్వహించినట్లు ఏబీఆర్‌ ట్రస్ట్‌ వ్యవస్థాప‌కురాలు డాక్టర్‌ స్వర్ణారెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఈద్‌గాం సమీపంలోని సిద్దాపూర్‌ రోడ్‌లో గల ప‌డిగెల భూమ‌వ్వ ఫంక్షన్‌హాల్‌లో మాజీ డిప్యూటి  స్పీక‌ర్ దివంగ‌త అయిండ్ల భీంరెడ్డి మెమోరియ‌ల్ ట్రస్ట్, టాటా క‌మ్యూనిటీ ఇన్షియేటివ్ ట్రస్ట్ టాటాస్ట్రైవ్, టాటా గ్రూప్ ఆఫ్కం కంపెనీలు సంయుక్తంగా జాబ్‌మేళాను నిర్వహించాయి.. ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ అర్హతలు ఉన్నవారు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం తరలివచ్చారు. అర్హత ఉన్నవారు ఏ కెరియర్‌ ఎంచుకోవాలో అవగాహన కల్పించేలా కౌన్సిలింగ్‌ ఇచ్చారు. నిరుద్యోగులు ఎక్కడ ఎలాంటి హడవుడి లేకుండా క్రమశిక్షణతో సహకరించారు. తమ పేరు పిలిచే వరకు ఒపిగ్గా ఎదురుచూశారు. కంపెనీల ప్రతినిధులు పలు సలహాలు ఇచ్చి అభ్యర్థులను సెలక్ట్‌ చేసుకున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్‌ స్వర్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్‌మేళా నిర్వహించినట్టు తెలిపారు. మన నిర్మల్‌ జిల్లా పరిసర ప్రాంతాల యువతీ, యువకుల్లోనే చాలా శక్తిసామర్థ్యాలున్నాయి. కళా, సాంస్కృతికం వంటి వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. కానీ, అవ‌కాశాలు లేక ఇక్క‌డే ఉండిపోతున్నార‌ని, అలాంటి వారి కోస‌మే ఈ ఉద్యోగ మేళా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.ఇప్పటికే నాన్నగారి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. పేదల ఆకలి తీర్చేందుకు రూ.15కే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరాలు నిర్వహించడమే కాకుండా ఉచిత వైద్యంతో పాటు కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడుతామని వివరించారు. జాబ్‌మేళాకు వచ్చిన అభ్యర్థులకు భోజనవసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో అయిండ్ల భీంరెడ్డి తనయుడు భూపాల్‌ రెడ్డి, ఏబీఆర్‌ ట్రస్ట్‌ సభ్యులు, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More
విద్యార్థుల ఆలోచ‌న‌ల్లో మార్పు రావాలి
విద్యార్థుల ఆలోచ‌న‌ల్లో మార్పు రావాలి

- వ్య‌క్తిత్వ వికాస నిపుణుడు డి.శ్రీ‌నివాస్‌

విద్యార్థుల ఆలోచ‌నా విధానంలో, జీవ‌న విధానంలో మార్పులు వ‌చ్చిన‌ప్పుడు అనుకున్న ల‌క్ష్యాల‌ను సుల‌భంగా సాధించ‌వ‌చ్చ‌ని ప్ర‌ముఖ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడు డి.శ్రీ‌నివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బుధ‌వార్‌పేట్ మున్నూరుకాపు సంఘ భ‌వ‌నంలో వివేకానంద సేవాస‌మితి, ఏక‌ల‌వ్య ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థుల‌కు వ్య‌క్తిత్వ వికాసంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్థుల‌నుద్దేశించి మాట్లాడారు. మార్పుకంటే ముందే మారే వారు జ్ఞాని అన్నారు. అన‌వ‌స‌ర ఆలోచ‌న‌లు వ‌దిలి విద్యార్థులు అవ‌స‌ర‌మున్న‌వాటినే ఆచ‌రించాల‌న్నారు. స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని రాబోయే 4 నెల‌ల్లో అహ‌ర్నిష‌లు శ్ర‌మించాల‌న్నారు. చ‌దువుకు డ‌బ్బు, పేద‌రికం అడ్డురాద‌న్నారు. ఎంతో మంది పేద విద్యార్థులు ప‌ట్టుద‌ల‌తో చ‌దివి జాతీయ‌స్థాయిలో ఉత్త‌మ ర్యాంకులు సాధించార‌న్నారు. చ‌దువుప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌డం, చ‌దివింది దీర్ఘ‌కాలం గుర్తుంచుకునేవిధానం, సుల‌భంగా స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోవ‌డం ఉపాధ్యాయుల బోధ‌న ప‌ట్ల ఆస‌క్తి క‌ల‌గ‌డానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలిపారు. గొప్ప‌వ్య‌క్తులంతా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దివార‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈవో టి.ప్ర‌ణీత‌, సెక్టోర‌ల్ అధికారి ప‌ద్మ‌, అధ్యక్షులు ర‌మేష్‌, శ్రీ‌నివాస్‌గుప్త‌, ర‌వీంధ‌ర్‌, గంగిశెట్టి ప్ర‌వీణ్‌, డాక్ట‌ర్ సుధాక‌ర్‌, ముర‌ళీ, డాక్ట‌ర్ ప్ర‌మోద్‌చంద్రారెడ్డి, కూన ర‌మేష్‌, రాజుల‌వారి దిగంబ‌ర్‌, మ‌నోజ్ వ‌స‌ల్‌, వివిధ పాఠ‌శాల‌ల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


 

Read More
ఈనెల 9న నిర్మ‌ల్‌లో జాబ్‌మేళా
ఈనెల 9న నిర్మ‌ల్‌లో జాబ్‌మేళా
ఈ నెల 9వ తేది శ‌నివారం మాజీ డిప్యూటి స్పీక‌ర్ దివంగ‌త అయిండ్ల భీంరెడ్డి మెమోరియ‌ల్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్న‌ట్లు ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు డాక్ట‌ర్ స్వ‌ర్ణారెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ఈద్‌గాం సిద్దాపూర్‌రోడ్ లో ఉన్న‌ ప‌డిగెల భూమ‌న్న ఫంక్ష‌న్‌హాల్‌లో టాటా క‌మ్యూనిటీ ఇనిషియేటివ్ ట్ర‌స్ట్ టాటాస్ట్రైవ్, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ వారు ఈ జాబ్‌మేళాను నిర్వ‌హిస్తార‌ని  పేర్కొన్నారు. 100% జాబ్ ప్లేస్‌మెంట్‌తో, స్వ‌ల్ప‌కాల వ్య‌వ‌ధిలో ఉచిత శిక్ష‌ణ తీసుకుని ఉద్యోగాన్ని పొందాల‌ని ఆమె సూచించారు. ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఆపైన విద్యార్హ‌త‌లు క‌లిగి 18 సంవ‌త్స‌రాలు నిండి 34 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల యువ‌తి, యువ‌కులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనాల‌న్నారు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. 
ప‌ద‌వ త‌ర‌గ‌తి పాసైన వారికి అసిస్టెంట్ ఎల‌క్ట్రీషియ‌న్ కోర్స్ 12 వారాలు, ఫుడ్ బేవ‌రేజ్ స్టీవార్డ్ కోర్సు 13 వారాలు, ఇంట‌ర్మీడియ‌ట్ పాసైన వారికి రిటైల్ సేల్స్ అసోసియేట్ కోర్సు 10 వారాల‌పాటు శిక్ష‌ణ ఉంటుంద‌ని ఆమె తెలిపారు. అలాగే డిగ్రీ పాసైన వారికి బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్, ఇన్సురెన్స్ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కాల‌వ్య‌వ‌ధి 45 రోజుల శిక్ష‌ణ‌, ఆటోసేల్స్ క‌న్స‌ల్టెంట్ కోర్సు కాల‌వ్య‌వ‌ధి 45 రోజుల శిక్ష‌ణ‌నిచ్చి వంద‌శాతం జాబ్‌ప్లేస్‌మెంట్ చూపించ‌డం జ‌రుగుతుంద‌ని ఆమె సూచించారు. మ‌రిన్ని వివ‌రాల కోసం 98850 96888 నెంబ‌ర్‌కు సంప్ర‌దించ‌గ‌ల‌రు.
Read More
కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్‌
కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్‌
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3,897 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 3897 పోస్టుల్లో.. 907 సివిల్ కానిస్టేబుల్, 2990 ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖాళీలకు సంబంధించిన వివరాలను వెంటనే బోర్డుకు అంద‌జేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వివరాలు అందినవెంటనే పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు.. పోస్టుల భర్తీ నోటిఫికేషన్, షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు.
 
Read More
టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్
టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్

- 8792 టీచ‌ర్ పోస్టుల‌కు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌

- ఈ నెల 30 నుంచి నవంబ‌ర్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను టీఎస్‌పీఎస్సీ శనివారం సాయంత్రం విడుదల చేసింది. టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 8వేల 792 ఉపాద్యాయ‌ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి. 31 జిల్లాల ప్రాతిపదికన టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు పేరుతో ఐదు నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. వీటికి  అక్టోబర్ 30 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 2018 ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. టీఆర్‌టీకి మొత్తం నాలుగు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

పోస్టుల వివ‌రాలుః

స్కూల్‌ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011, ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు. మ‌న జిల్లాకు 226 పోస్టులు కేటాయించ‌గా మిగ‌తా జిల్లాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 293, మంచిర్యాల 169, కొమురం భీం ఆసిఫాబాద్ 894, కరీంనగర్ – 71, జగిత్యాల – 253, పెద్దపల్లి – 53, రాజన్న సిరిసిల్ల – 76, నిజామాబాద్ – 158, కామారెడ్డి – 381, వరంగల్ అర్బన్ – 22, వరంగల్ రూరల్ – 23, జయశంకర్ భూపాలపల్లి – 319, జనగాం – 60, మహబూబాబాద్ – 128, ఖమ్మం – 57, భద్రాద్రి కొత్తగూడెం – 185, మెదక్ – 281, సంగారెడ్డి – 903, సిద్దిపేట – 101, మహబూబ్ నగర్ – 731, వనపర్తి – 154, నాగర్ కర్నూల్ – 385, జోగులాంబ గద్వాల్ – 438, నల్లగొండ – 190, సూర్యపేట – 156.  

Read More
మెయిన్స్‌పై అనుమానాలు!
మెయిన్స్‌పై అనుమానాలు!
ఈ నెల 18 నుంచి జ‌రుగాల్సిన గురుకులాల పీజీటీ, టీజీటీ మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ప‌రీక్ష‌లకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి సెంటర్లు ఫైనల్ కాక‌పోగా, అభ్యర్థుల హాల్ టికెట్లు ఇష్యూపై కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సాధారణంగా ఏ పరీక్షకు అయినా వారం రోజులకు ముందే హాల్ టికెట్లు అభ్యర్థుల చేతికి అందుతుంటాయి. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు కనీసం రెండు లేదా మూడు రోజుల సమయం ఇస్తుంటారు. కానీ 12వ తారీకు వరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
అభ్యర్థులు తమకు ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఇచ్చారని.. మరో 60 రోజుల సమయం ఇచ్చి మొత్తం కలిపి 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఓయు లో దీనిపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మ‌రోవైపు అభ్యర్థులు ఎక్కువ మంది తెలుగు మీడియం వారే ఉన్నారని.., అయినా పుస్తకాలు కూడా లేకుండా పరీక్షలు జరిపితే లాభమేంటని ప్రశ్నించారు. ప్రయివేటు పుస్తకాలు ప్రామాణికం కాదని పేర్కొన్నారు. ఇప్పటికే టీఎఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణిని కలిసి అభ్యర్థులు ఒక వినతిపత్రం సమర్పించారు.
 
Read More
1 2 3 4 5 >> Last