Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ఘ‌నంగా గోమాత‌కు పూజ‌లు
ఘ‌నంగా గోమాత‌కు పూజ‌లు

గో ద్వాద‌శిని పురస్క‌రించుకుని శాస్త్రీన‌గ‌ర్‌లోని మీహోమ్ రెసిడెన్షిలో ఆదివారం మ‌హిళ‌లు గోమాత‌కు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అలాగే పూజ‌ల అనంత‌రం హార‌తి, మంత్ర‌పుష్పం, ప్ర‌దాజ్ఞ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల‌ను దోముడాల ప్ర‌వీన్‌కుమార్ శ‌ర్మ మ‌హిళ‌ల‌చే నిర్వ‌హింప‌చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వీన్‌కుమార్‌శ‌ర్మ మాట్లాడుతూ గోమాత‌ను పూజించ‌డం వ‌ల్ల ఆయురారోగ్యాల‌తోపాటు అష్ట ఐశ్వ‌ర్యాలు సిద్దిస్తాయ‌ని తెలిపారు. మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాలు గోమాత‌ను పూజించ‌డంలో ఇమిడి ఉన్నాయ‌న్నారు. గోమాత‌ను పూజించ‌డమ‌నేది పురాణాల‌లో చెప్ప‌డం జ‌రిగింద‌ని తెలిపారు. గోవు నుండి ల‌భించే పాలు,పెరుగు, వెన్న‌,నెయ్యితోపాటు గోమూత్రం కూడా మాన‌వులు తీసుకోవ‌డంతో వారి ఆరోగ్యంతోపాటు ఆయుశ్శును కూడా పెంచుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హ‌రిత‌, స్వ‌ప్న‌, క‌ళ్యాణ్‌, వ‌న‌జ‌, సుహాసిని, అభిలాష‌, స్వర్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Read More
27న మేడిప‌ల్లి గ‌ణ‌ప‌తి ఆల‌యంలో పూజ‌లు
27న మేడిప‌ల్లి గ‌ణ‌ప‌తి ఆల‌యంలో పూజ‌లు

ఈనెల 27వ తేదిన నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని మేడిప‌ల్లి గ‌ణ‌ప‌తి ఆల‌యంలో సంక‌టహ‌ర చ‌తుర్థి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య అర్చ‌కులు దోముడాల ప్ర‌వీన్‌శ‌ర్మ తెలిపారు. సంక‌ట‌హ‌ర చతుర్థి అశ్వీజ బ‌హుళ చ‌తుర్థిని పుర‌స్క‌రించుకుని 27వ తేది శ‌నివారం రోజు ఉద‌యం 7:30 గంట‌ల‌కు విఘ్నేశ్వ‌రునికి పంచామృతాభిషేకం, 21 సుగంధ ద్ర‌వ్యాల‌తో అభిషేక పూజ‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని ఆల‌య పూజారి పేర్కొన్నారు. అలాగే ఉద‌యం 10 గంట‌ల‌కు ల‌క్ష్మీగ‌ణ‌ప‌తి హోమం, సాయంత్రం 7 గంట‌ల‌కు చంద్ర‌ద‌ర్శ‌నం , 8:35 గంట‌ల‌కు అభిషేకం క‌ల‌ద‌ని ఆయన వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ ఆల‌య పూజారి ప్ర‌వీన్‌శ‌ర్మ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ పూజలో పాల్గొన్న‌భ‌క్తుల‌కు ఆయురారోగ్యాలతోపాటు ఐశ్వ‌ర్యం సిద్దిస్తాయ‌ని తెలియ‌జేశారు. కావున భ‌క్తులు అధిక‌సంఖ్య‌లో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులుకావాల‌ని ఆయ‌న కోరారు.

Read More
ఘ‌నంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం
ఘ‌నంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం

- డీఎస్పీ ఉపేంధ‌ర్‌రెడ్డి

శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను విశ్వ‌హిందుప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో స్థానిక బంగ‌ల్‌పేట్ మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారి ఆల‌యంలో డీఎస్పీ ఉపేంధ‌ర్‌రెడ్డి బుధ‌వారం ప్రారంభించారు. అమ్మ‌వారి ఆల‌యంలో డీఎస్పీ ప్ర‌త్యేక పూజ‌లు చేసిన‌ అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ హిందువులు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పండుగ వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని సూచించారు. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా రావ‌ణ ద‌హ‌న కార్య‌క్ర‌మానికి ఆల‌య క‌మిటి స‌భ్యులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు.  అనంత‌రం వార్డు కౌన్సిల‌ర్ పాత‌ర్ల చంద్ర‌క‌ళ గ‌ణేష్ మాట్లాడుతూ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా మ‌హాల‌క్ష్మీ ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు మున్సిప‌ల్ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విశ్వ‌హిందు ప‌రిష‌త్ న‌గ‌ర అధ్య‌క్షులు ప‌తికె రాజేంధ‌ర్‌, భ‌జ‌రంగ్‌ద‌ళ్ విభాగ్ స‌హ‌ప్ర‌ముఖ్ ఎడిపెల్లి న‌రేంధ‌ర్‌, మ‌హాల‌క్ష్మీ ఆల‌య క‌మిటి చైర్మెన్ తోట సురేంద‌ర్‌, వీహెచ్‌పీ జిల్లా అధ్య‌క్షులు ముప్పిడి ర‌వి,  మ‌హోర్ క‌పిల్‌, దొన‌గిరి ముర‌ళీ, అనీల్‌, న‌రేంద‌ర్‌, సాయి, విక్కి, బంగ‌ల్‌పేట్ ఆంజ‌నేయ గ‌ణేష్ మండ‌లి యూత్ స‌భ్యులు తోట‌ నర్స‌య్య‌, సుధాక‌ర్‌, ఆనంద్‌,  పెండం శ్రీ‌నివాస్‌, పాత‌ర్ల హ‌రీష్‌, శ్రీ‌హ‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Read More
భ‌క్త‌జ‌న సంద్రంగా క‌దిలి
భ‌క్త‌జ‌న సంద్రంగా క‌దిలి

శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో కదిలి శ్రీ మాతాన్నపూర్ణ పాపహరేశ్వర ఆలయం భక్తజనం కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణంలోని పరిసరాలన్నీ శివ‌నామ‌స్మ‌ర‌ణ‌ మారుమోగాయి. గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు, అర్చక సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. మ‌రోవైపు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని సాయిదీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో నిర్మల్, సోన్‌ మండలం నుంచి కదిలి పాపహరేశ్వరాలయం పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేపట్టారు. నటరాజ్‌నగర్‌ వైఎస్సార్‌ ఫంక్షన్‌హాల్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా సాయిదీక్ష సేవాసమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన, ఐక్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. ప్రతిఒక్కరూ భక్తిభావం ఏర్పర్చుకోవాలని సూచించారు. మానసిక ప్రశాంతతతో అనుకున్నది సాధించగల్గుతామని చెప్పారు. అనంతరం స్వామివారి సంకీర్తనలు, భజనపాటలతో యాత్రను ప్రారంభించారు. ఇందులో రావుల రాంనాథ్, కొరిపెల్లి దేవేందర్‌రెడ్డి, న్యూవెల్మల్, బొప్పారం, వెంకటాపూర్, న్యూముజ్గి గ్రామాలకు చెందిన సాయిదీక్ష భక్తులు పాల్గొన్నారు.

 

Read More
ఘ‌నంగా సాయిబాబా విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌
ఘ‌నంగా సాయిబాబా విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌
నిర్మల్ మండలంలోని మంజులాపూర్ గ్రామంలో ఐదు రోజులుగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు ఆదివారం వేద పండితుడు శ్రీజోషి భగవాన్ మహరాజ్, ప్ర‌కాశ్ పంతులు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శాంతిపాఠము, దేవతార్చన, రుద్రాభిషేకం, శాంతిహోమం, గర్త సంస్కారం, మీన పుష్కరంశ, యంత్ర మూర్తిప్రతిష్ఠ, షోడశోపచారపూజ, నేత్రాన్మలనం, ద్రుగ్బతి, పూర్ణాహుతి, మహా హారతి, మంత్ర పుష్పం తదితర కార్యక్రమాల అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకొని భక్తిమార్గంలో నడువాలన్నారు.
మంత్రి అల్లోలను ఆలయ కమిటీ, వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విగ్రహ దాత, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డిని ఘనంగా సన్మానం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయి నామ స్మ‌ర‌ణ‌తో ఆల‌యం మారుమోగింది. కార్యక్రమంలో నిర్మ‌ల్ మునిసిప‌ల్‌ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, సర్పంచి చెనిగారపు నరేశ్, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, సాయిదీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ అయిండ్ల పోశెట్టి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
Read More
పంచ‌మి వేడుక‌లతో పుల‌కించిన బాస‌ర‌
పంచ‌మి వేడుక‌లతో పుల‌కించిన బాస‌ర‌
- వైభ‌వంగా వ‌సంత పంచ‌మి వేడుక‌లు
- భారీగా తర‌లివ‌చ్చిన భ‌క్తులు
- మొక్కులు తీర్చుకున్న ఉప‌ముఖ్య‌మంత్రి
రాష్ట్రంలో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన‌ బాస‌ర‌ సరస్వతీ ఆలయం సోమవారం భక్తజన సంద్రమైంది. వసంత పంచమి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ప్రభుత్వం తరుఫున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, లోక్‌సభలో తెరాస పక్ష నేత జితేందర్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు అందచేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి జన్మదిన వేడుకలకు తరలివచ్చిన అశేష భక్తజనావళితో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి. ఉదయం అభిషేక సేవతో ప్రారంభమైన జన్మదిన వేడుకలు రాత్రి అమ్మవారికి నిర్వహించిన మహా మంగళహారతి, పల్లకిసేవ కార్యక్రమాలతో ముగిసాయి. అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టేందుకు తరలివచ్చిన చిన్నారులతో బాసర పులకించిపోయింది.
ఉత్సవ పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి కానుకలు సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, లోక్‌సభలో తెరాస పక్ష నేత జితేందర్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు అందచేశారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, క‌లెక్ట‌ర్‌ ప్రశాంతి, ఆలయాధికారులు ఆలయానికి చేరుకుని ప్రభుత్వ లాంచనాలతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
వేకువజామున రెండుగంటలకు ఆలయ ద్వారాలు తెరచి మంగళవాయిద్యాలతో అమ్మవారిని మేల్కొలిపి  అభిషేకం, మంగళహారతి నిర్వహించారు. కార్యక్రమాల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం 3150 మంది చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహరి త‌న మ‌న‌వ‌రాలికి అక్ష‌రాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. వేకువజామునుంచి దర్శనాలకు, పూజలకు భక్తులు బారులు తీరారు. గోదావరి స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో పులకించిపోయాయి. సుమారు అరవై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Read More
1 2 3 4 5 >> Last