Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
వ‌డ్యాల్‌లో సినిమా షూటింగ్ సంద‌డి
వ‌డ్యాల్‌లో సినిమా షూటింగ్ సంద‌డి

ల‌క్ష్మ‌ణచాంద మండ‌లంలోని వ‌డ్యాల్ గ్రామం సినిమా షూటింగ్‌తో సంద‌డిగా మారింది. కొన్ని రోజులుగా గ్రామంలోని ప‌లు చోట్ల సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. హీరో అల్ల‌రి న‌రేష్, సునీల్ న‌టిస్తున్న సినిమాకు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను వ‌డ్యాల్ గ్రామంలో, శివారు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి ఇక్క‌డ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌టంతో గ్రామంలో సంద‌డి వాతావ‌ర‌ణం క‌న్పిస్తోంది. ముఖ్యంగా హీరోల‌ను, చిత్రీక‌ర‌ణ‌ను చూసేందుకు గ్రామ ప్ర‌జ‌ల‌తో పాటు చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు కూడా వ‌స్తున్నారు. శనివారం గ్రామ శివారులో ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. షూటింగ్ చూసేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చారు. అంత‌కుముందు జ‌రిగిన షూటింగ్‌లో యాంక‌ర్ ఝాన్సీ, స‌న్నీ, ఆటో రాంప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. భీమినేని శ్రీనివాస్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో తీసిన‌ సుడిగాడు సినిమాకు ఇది సీక్వెల్ అని చెప్పుకుంటున్నారంతా. 
 
 
Read More
భ్రమరాంబ క్యారెక్టర్‌ నా అదృష్టం: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
భ్రమరాంబ క్యారెక్టర్‌ నా అదృష్టం: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
హైదరాబాద్ : యువ సామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్‌ ..వేడుక చూద్దాం'. ఈ సినిమా మే 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఇంటర్వ్యూ.
 
క్యారెక్టర్‌ గురించి: - రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు భ్రమరాంబ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఇలాంటి పాత్రను చేయలేదు. చాలా స్ట్రాంగ్‌ క్యారెక్టరైజేషన్‌. చాలా లవబుల్‌ క్యారెక్టర్‌. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోయిన్‌ పాత్రలాగా నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి పాత్రకు నేను న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చినందుకు ముందుగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణగారికి థాంక్స్‌. నేను భ్రమరాంబ అయ్యానో, లేక భ్రమరాంబ పాత్రే నాలో అవహించిందో తెలియలేదు కానీ ఈ రోల్‌ చేసేటప్పుడు చాలా ఎంజాయ్‌ చేశాను. 
నేనైతే అలాగే చెబుతాను: - ఎవరైనా నా దగ్గరకు వచ్చి అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అయితే అబ్బాయిలు పాయిజనెస్‌ అని నేను చెబుతాను.
 
కాస్ట్యూమ్స్‌ విషయంలో: - విలేజ్‌లో ఉన్న పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయే భ్రమరాంబ. అందుకే పల్లెటూర్లో అమ్మాయిలు బేసే బ్రయిట్‌ కలర్స్‌లా ఇందులో నాకు కూడా బ్రయిట్‌ కలర్స్‌ను డిజైన్‌ చేశారు. భ్రమరాంబగా నా క్యారెక్టర్‌ ఎంత క్యాచీగా జనాలకు రిజిష్టర్‌ అయ్యిందో, నా డ్రెస్సింగ్‌ కూడా అంతే ట్రెండింగ్‌ అవుతుంది. నీరజకోన ఈ సినిమా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు. 
 
నేను హైదరాబాదీ అమ్మాయినే: - నేను ఉత్తరాది అమ్మాయినని మరచిపోయాను. నా సినిమా కెరీర్‌లో టాలీవుడ్‌లోనే ప్రారంభమైంది. నేను హైదరాబాదీ అమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను. నేను తెలుగు కూడా నేర్చుకుంటాను. చెన్నైలో తమిళ సినిమా చేసేటప్పుడు నాకు తెలుగు ట్రాన్స్‌లేటర్‌ను ఇచ్చారు. తమిళంలో డైలాగ్స్‌ను తెలుగులో చెబుతుంటే నేను తమిళ్‌లో డైలాగ్స్‌ చెప్పాను. తెలుగు నాకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది. 
 
కారణం డైరెక్టరే: - నాకు, చైతుకు మధ్య కెమిస్ట్రీ బాగా పండిందంటే కారణం డైరెక్టరే. ఆయన మా క్యారెక్టర్స్‌ను అందంగా డిజైన్‌ చేయకుంటే మేం ఆ రేంజ్‌ కెమిస్ట్రీ పండించలేం కదా. ఈ మూవీలో ఇన్నోసెంట్‌ లవ్‌స్టోరీ కనపడుతుంది. కళ్యాణ్‌కృష్ణ చాలా మంచి వ్యక్తి. 
 
చైతుతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌: - చైతుతో నాకు ముందు నుండే మంచి పరిచయం ఉండటం వల్ల నాకు ఈ సినిమాలో తనతో వర్క్‌ చేసేటప్పుడు మంచి కంఫర్ట్‌ లెవల్స్‌ ఉన్నాయి. తను చాలా మంచి అబ్బాయి. 
 
నిర్మాత గురించి: - నాగార్జునగారు చాలా కేర్‌ తీసుకున్నారు. చాలా కంఫర్ట్‌గా ఉంచారు. సుప్రియగారు కూడా తోడుగా ఉండేవారు. సినిమా చివరి రోజు నాగ్‌సార్‌ నాకు ఫోన్‌ చేశారు. నేను మూవీ చూశాను. భ్రమరాంబ క్యారెక్టర్‌ బావుందని చాలా మెచ్చుకున్నారు. 
Read More
నా హృదయానికి బాగా దగ్గరైన వ్యక్తి
నా హృదయానికి బాగా దగ్గరైన వ్యక్తి
హైదరాబాద్ : నా హృదయానికి బాగా దగ్గరైన వ్యక్తి సుకుమార్. ఆయన్ని బయటి వ్యక్తిగా నేనేప్పుడు చూడలేదు.  సుకుమార్ రైటింగ్స్‌కు సంబంధించిన వేడుకకు రావడం ఓ బాధ్యతగా, ప్రేమగానే భావిస్తాను అని అన్నారు ప్రముఖ హీరో ఎన్టీఆర్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడి ప్రేమకథను తెరపై చూపించడమనే యూనిక్ కాన్సెప్ట్‌తో హరిప్రసాద్ సినిమాను తెరకెక్కించడం ఆనందంగా ఉంది.  కథకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దర్శకుల్లో సుకుమార్ ఒకరు.  సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త కథలను, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను చిత్రసీమకు పరిచయం చేయడం సుకుమార్ గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు దర్శకుడు చిత్ర టీజర్ బాగుంది. సినిమా విజయవంతం కావాలి అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ కుమారి 21ఎఫ్ అనే చిన్న సినిమాను మూదు పదాల ట్వీట్‌తో సూపర్‌హిట్ చేశారు ఎన్టీఆర్ అలాంటి సహృదయత చాలా తక్కువ మందికి ఉంటుంది నాన్నకు ప్రేమతో నుంచి మా అనుబంధం కొనసాగుతూనే ఉంది.  ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి ఎలాంటి సంశయాలు లేకుండా అతడి దగ్గరకు వెళ్లగానే ఎన్టీఆర్ స్వయంగా నేను వస్తున్నాను అని  అన్నారు. ఆయన  ప్రేమకు పాత్రుడినైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను.  
 
కొందరితో మాట్లాడితే ఆత్మలతో సంభాషించినట్లు ఉంటుంది. వారిలోని కోపం, నవ్వు సులభంగా తెలిసిపోతాయి. అలాగే తారక్ నవ్వు వెనుక సముద్రమంతా ప్రేమ ఉంటుంది. అతడి కోపం వెనుక చిన్నపాటి ఆవేశం ఉంటుంది. నా బ్యానర్‌లో ప్రతిసినిమాకు అతడు రావడం ఆనవాయితీగా మారాలని కోరుకుంటున్నాను(నవ్వుతూ). కుమారి 21ఎఫ్ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. హరిప్రసాద్ చెప్పిన కథ మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. వన్ నేనొక్కడినే మూల కథ అతడితే. నేను దానిని డెవలప్ చేశానంతే. అతడి తెలివితేటలపై నమ్మకంతో  ఒక్కరోజు కూడా నేను సెట్స్‌కు వెళ్లలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. తపనకు, ప్రేమకు మధ్యకు నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది ఆసక్తిని పంచుతుంది అని అన్నారు. కథానుగుణంగా ఓ దర్శకుడు సెట్స్‌లో ఎలా ఉంటాడో, బయటి అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరమైందని, దాంతో నాకు తెలిసిన దర్శకుడు సుకుమార్ బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలోపెట్టుకొని హీరో పాత్రను తీర్చిదిద్దానని హరిప్రసాద్ చెప్పారు. కుమారి 21ఎఫ్‌కు మించి ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని నిర్మాత విజయ్‌కుమార్ తెలిపారు. 
 
సుకుమార్‌తో కలిసి సినిమా చేయాలనే తన కల దర్శకుడు చిత్రంతో నెరవేరిందని సంగీత దర్శకుడు సాయికార్తీక్ చెప్పారు. ఈ చిత్రంలో నమ్రత అనే అమ్మాయిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రను పోషించానని ఈషా చెప్పింది. ఈ కార్యక్రమంలో బి.ఎన్.సి.ఎస్. పి. విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర, అనుమోలు ప్రవీణ్, ఇషా, పూజిత, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, చెర్రీ, రామ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అనుమోలు ప్రవీణ్‌కుమార్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ కోలా. 
Read More
బాలుకు ఇళ‌య‌రాజా లీగ‌ల్ నోటీసు
బాలుకు ఇళ‌య‌రాజా లీగ‌ల్ నోటీసు
ద‌క్షిణాది చిత్రాల సంగీతంలో వారిద్ద‌రూ ప్ర‌త్యేకం. ఒక‌రు సంగీత ద‌ర్శ‌కుడు మ‌రొక‌రు అద్భుత గాయ‌కుడు. వారిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు కూడా అన్నాత‌మ్ముళ్ల‌లాగే ఉంటుంది. కానీ ఏమైందో ఏమో.. త‌మ్ముడికి అన్న లీగ‌ల్ నోటీసులు పంపించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మ‌ధ్య ఈ నోటీసుల వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌లి కాలంలో సినిమా పాటల పాడటానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని బాలు.. ఇతర దేశాల్లో సంగీత క‌చేరీలు నిర్వహిస్తున్నారు. ప‌లువ‌రు సంగీత దర్శకుల సారథ్యంలో ఆయన పాడిన పాటలను వేదిక మీద పాడి అభిమానులను అలరిస్తుంటారు.
 
అయితే కొంత కాలంగా తను కంపోజ్ చేసిన పాటల రైట్స్ విషయంలో ప‌క్కాగా వ్యవహరిస్తున్న ఇళయరాజా, అంతర్జాతీయ వేదికల మీద తన అనుమతి లేకుండా, తాను కంపోజ్ చేసిన పాటలు పాడటంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు కాదు ఇలాంటి క‌చేరీల‌ను తరుచూ నిర్వహిస్తున్న ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు గాయని చిత్ర, ఎస్పీ కుమార్ చరణ్‌ల‌కు లీగల్ నోటీసుల పంపిచారు. ఇక మీదట తన అనుమతి లేకుండా తన పాటలను ప్రదర్శనలలో ఆలపిస్తే చట్టపరమైన చర్యలు కుంటామని తెలిపారు.
 
తనకు లీగల్ నోటీసులు వచ్చిన విషయాన్ని బాలు ధృవీకరించారు. ఇటీవల టొరంటో, రష్యా, దుబాయ్‌ల‌లో జరిగిన పలు వేడుకల్లో తాను ఇళయరాజా గీతాలను ఆలపించానని.. అయితే అమెరికాలో చేసే క చేరీకి మాత్రమే రాజా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కావటం లేదన్నారు. అదే సమయంలో తన ట్రూప్ లోని ఇతర గాయకుల‌ను కూడా ఇకపై ఇళయారాజా గీతాలను స్టేజ్ పై పర్ఫామ్ చేయవద్దని సూచించినట్టుగా బాలు తెలిపారు.
Read More
బాహుబ‌లి-2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది
బాహుబ‌లి-2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ ట్రైల‌ర్ యూట్యూబ్ లో అప్పుడే దుమ్మురేపుతోంది. యుద్ధ స‌న్నివేశాలు, అనుష్క అందాలు, శివ‌గామి ఎమోష‌న్స్, మాహిష్మ‌తి సామ్రాజ్యం, ప్ర‌భాస్, రాణాల మ‌ధ్య పోరు ఇలా అన్ని అంశాల‌ను ట్రైల‌ర్ లో చూపించారు. అభిమానుల అంచనాలని మించేలా ఈ ట్రైలర్ కట్ చేశాడు ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి. బాహుబలి 2 చిత్ర ట్రైలర్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైంది.
ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని సినీమ్యాక్స్ లో చిత్ర ట్రైలర్ విడుదల చేయగా, ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి రాజమౌళి, రానా, ప్రభాస్, రాఘవేంద్రరావు, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, కీరవాణి, చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. మార్చి 26న చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా జరిపే ప్లాన్ లో ఉన్నారు. బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ ట్రైల‌ర్ మీకూ చూడాల‌ని ఉంది క‌దూ. ఇంకేందుకు లేటు. ఇక్కడ లింక్ ను క్లిక్ చేయండి.
 
 
Read More
జ‌య‌సుధ భ‌ర్త అనుమానాస్ప‌ద మృతి
జ‌య‌సుధ భ‌ర్త అనుమానాస్ప‌ద మృతి
ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ (58) ముంబైలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరి వెళ్లింది. నితిన్ కపూర్ ముంబయిలోని తన నివాసంలో చనిపోయారు. అయితే, ఎలా చనిపోయారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు నితిన్ కపూర్ సోదరుడు అవుతారు. 
నితిన్ కపుర్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. జేయస్కే కంబైన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు తీశారు. ఆశాజ్యోతి అనే సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా కూడా వ్యవహరించారు. జయసుధ, నితిన్ దంపతులకు 1985లో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి నీహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో శ్రేయాన్ కొద్దిరోజుల క్రితం హీరోగా పరిచయమయ్యాడు. 
 
Read More
1 2 3 4 5 >> Last