Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
జియో సిమ్ ఉంటే ఆడుకోవ‌చ్చు

ఐదు నెలల కింద‌ట‌ ప్రపంచంలోని పలు దేశాల్లో విడుదలై సంచలనం సృష్టించిన పోకిమాన్ గో గేమ్ ఇప్పుడు ఇండియాకు వచ్చేసింది. ఆ గేమ్ తయారీ సంస్థ అయిన నియాంటిక్... భారత్‌లో రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఆ గేమ్‌ను మన దగ్గర విడుదల చేసింది. పోకిమాన్ గేమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు తమ తమ యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని గేమ్ ఆడుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 8.0 ఆపైన వెర్షన్ ఉన్న యూజర్లు ఈ గేమ్‌ను తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
అయితే పోకిమాన్ గో విడుదల అయిన సందర్భంగా దేశంలో ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, దాని పార్ట్‌నర్ స్టోర్స్‌లలో పోకిస్టాప్స్, జిమ్స్ పేరిట ఆ గేమ్ కోసం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. గేమ్‌కు సంబంధించి కొనుగోళ్లు, ఇతర సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ హబ్‌లు పనిచేస్తాయి. అదేవిధంగా జియో సిమ్ వినియోగదారులు ఎలాంటి డేటా చార్జిలు లేకుండానే ఈ గేమ్‌ను మార్చి 31, 2017 వరకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఆ సిమ్ యూజర్లు తమ ఫోన్లలో ఉండే జియో చాట్ యాప్‌ను ఓపెన్ చేస్తే అందులో పోకిమాన్ గో గేమ్‌కు సంబంధించిన ప్రత్యేక చానల్ అందుబాటులో ఉంటుంది. దాని ద్వారా గేమ్ ప్రియులు పోకిమాన్ గో కు సంబంధించిన సూచనలు, మెళకువలను సులభంగా తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్ లో యాడ్స్ కోసం సంప్ర‌దించాల్సిన నెంబ‌ర్లు :
9010066005, 8555019807
 

 

Popular News may like