Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
దుబాయ్‌లో సిలిండ‌ర్ పేలి జిల్లావాసుల మృతి

బ‌తుకుదెరువు కోసం దుబాయ్ బాట ప‌ట్టిన ఆ యువ‌కులు అగ్నికి ఆహూతి అయ్యారు. ఎప్ప‌టిలాగే ప‌ని చేసుకుని రూమ్ కి వ‌చ్చిన ఆ యువ‌కులు వంట చేసుకునే స‌మ‌యంలో ప్ర‌మాదవ‌శాత్తు గ్యాస్ సిలెండ‌ర్ పేలి మృత్యువాత ప‌డ్డారు. నిర్మ‌ల్ జిల్లా సారంగాపూర్ కి చెందిన ముచ్చిళ్ల న‌రేశ్ కుమార్ (26) కూలీ ప‌ని కోసం మూడేళ్ల కింద‌ట దుబాయ్ వెళ్లాడు. త‌న‌తో పాటు మ‌రో నలుగురు క‌లిసి ఒకే రూమ్ లో ఉంటున్నారు. గురువారం ప‌ని ముగించుకుని రూమ్ కి వ‌చ్చిన ఆ ఐదుగురు వంట చేసుకునే స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు సిలెండర్ పేల‌డంతో న‌లుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందగా మ‌రో వ్య‌క్తి తీవ్ర‌గాయాల‌తో ఆసుప‌త్రిలో ఉన్న‌ట్లు స‌మాచారం. మృతుల్లో సారంగాపూర్ కి చెందిన న‌రేష్ కుమార్, పొన్క‌ల్ నుంచి ఇద్దరు, కరీంనగర్ జిల్లా నుంచి మరో ఇద్దరున్నట్లు తెలిసింది. నరేశ్ మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి.. ఇంతవరకు ఒక్కసారి కూడా కుటుంబసభ్యలను చూసేందుకు రాలేదు. ఈయనకు భార్య, ఓ కుమారుడు (5 ఏళ్లు) ఉన్నారు. నరేశ్ హఠాన్మరణంతో సారంగపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.  
 

Popular News may like