Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
పాక్‌కో ఖతం కర్‌దో!

- మూకుమ్మడిగా నినదించిన నిర్మల్‌ జిల్లా యువత
- ప్రతీకారం తీర్చుకోవాలంటూ పాక్‌ దిష్టిబొమ్మలు దగ్ధం
- భైంసా, నిర్మల్‌ సహా పలుచోట్ల క్యాండిల్‌ ర్యాలీలు
- పాఠశాలల్లోనూ చిన్నారుల కన్నీటి నివాళి
- అమరవీరులకు బీజేపీ, ఏబీవీపీ శ్రద్ధాంజలి

పుల్వామా ఘటనతో యావద్భారతంలో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ భావనతో.. చిన్న, పెద్ద తేడాలేకుండా అందరూ రోడ్లెక్కారు. అమరవీరులకు క్యాండిల్‌ ర్యాలీలతో ఘననివాళుర్పిస్తూనే.. పాక్‌పై, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారతసేనలు ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. పలుచోట్ల పాఠశాలల్లో చిన్నారులు అమరజవాన్లకు నివాళులర్పించిన చిత్రాలు కన్నీరు తెప్పించాయి. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల జరిగిన కార్యక్రమాలను పరిశీలిస్తే..

CRPF జవాన్లపై జైషే మహ్మద్ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ దాడిని నిరసిస్తూ.. బీజేవైఎం నిర్మల్‌ శాఖ ఆధ్వర్యంలో పాకిస్తాన్‌ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్‌, అసెంబ్లీ కన్వీనర్ అనుముల శ్రవణ్, పట్టణ అధికార ప్రతినిధి దశరథ్ పోశెట్టి, పట్టణ అధ్యక్షుడు మంత్రి శివ, దిలవార్‌పూర్‌ ఉపసర్పంచ్‌ రాజేశ్వర్‌ రెడ్డి, ఇతర సీనియర్‌నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలోనూ క్యాండిల్‌ ర్యాలీ జరిగింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Basar

భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదం అంతుచూడాలని నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సరస్వతీ క్షేత్రమైన బాసర్‌లోనూ అమరజవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ్‌ (తాపస్‌), పలు స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

నిర్మల్ బంగల్‌పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమర జవాన్లకు అశృనివాళి అర్పించారు. బోర్డుపై అమరజవాన్లకు నివాళి అని రాసి.. జాతీయ పతాకాన్ని ఉంచి నివాళుర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అమర జవాన్ల స్మృతి చిహ్నానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఉపాధ్యాయులు దేశ రక్షణలో సైనికుల పాత్రను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంనరేష్‌, సాయన్న, జ్యోతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

రాత్రి నిర్మల్‌లోని వివేకానంద చౌక్‌ వద్ద ‘స్ఫూర్తి నిర్మాణ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ సహా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. 

అమరజవాన్లకు మననిర్మల్‌.కామ్‌ ఘననివాళి
ఇలాంటి ఘటనలు జరిగినపుడు మాత్రమే మన దేశభక్తిని ప్రదర్శించేందుకు రోడ్లపైకి రావాలని అనుకోవద్దు. 
జవాన్ల సేవలను నిత్యం గుర్తుచేసుకుంటూ.. దేశ రక్షణలో మన బాధ్యతను గుర్తెరిగి సమాజశ్రేయస్సులో భాగం కావాలని కోరుతున్నాం.
 

 

Popular News may like