Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ఈ ఎన్నిక‌ల్లో నిరంత‌ర నిఘా

- భారీగా ప‌ట్టుబ‌డ్డ న‌గ‌దు, మ‌ద్యం
- జిల్లా ఎస్పీ సి.శ‌శిధ‌ర్‌రాజు

ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక పోలీసు బృంధాల‌తో నిరంత‌ర నిఘాను ఏర్పాటుచేయ‌డం జ‌రిగింద‌ని జిల్లా ఎస్పీ సి.శశిధ‌ర్‌రాజు అన్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జిల్లా ఎస్పీ విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిర్మ‌ల్ జిల్లాలో ఇప్పటి వ‌ర‌కు రూ.58 ల‌క్ష‌ల న‌గ‌దు పట్టుకోవ‌డం జ‌రిగింద‌ని, అలాగే 5152 లీట‌ర్ల మ‌ద్యం, రూ.21 ల‌క్ష‌ల 94 వేల విలువ‌గ‌ల అక్ర‌మ మ‌ద్యాన్ని స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. జిల్లాలో 493 సాధార‌ణ పోలింగ్ కేంద్రాలు ఉండ‌గా, స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాలు 118, న‌క్స‌ల్స్ ప్ర‌భావిత పోలింగ్ కేంద్రాలు 8 తో మొత్తం 619 పోలింగ్ కేంద్రాలున్నాయ‌ని పేర్కొన్నారు. జిల్లాలో పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు 64 రూట్ మొబైల్ పార్టీలు, 20 స్ట్రైకింగ్ ఫోర్స్ బృంధాలు, స్టాటిక్ స‌ర్వేలేసు టీమ్‌లు 15, ఫ్ల‌యింగ్‌స్క్వాడ్ 15 బృంధాలతోపాటు బుధ‌వారం రాత్రి నుండి 15 ప్ర‌త్యేక పోలీసు బృంధాలు నిరంత‌ర నిఘా కోసం పెట్రోలింగ్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అలాగే 5 కంపెనీల కేంద్ర బ‌ల‌గాలు, 500 మంది మ‌హారాష్ట్ర పోలీసుల‌తో స‌హా మొత్తం 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా ఎస్పీ శ‌శిధ‌ర్‌రాజు తెలిపారు. 

Popular News may like