Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
ప‌ర్వ‌తారోహ‌ణ‌లో ఎన్‌సీసీ కేడెట్లు

- బంగారు ప‌త‌కాలు సాధించిన కేడెట్ల‌కు క‌లెక్ట‌ర్ అభినంద‌

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గ్వాలియ‌ర్‌లో ఇటీవ‌ల జరిగిన ఎన్‌సీసీ కేడెట్ల జాతీయ ప‌ర్వ‌తారోహ‌ణ శిక్ష‌ణ శిభిరం జ‌రిగింది. నిర్మల్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ జుమ్మెరాత్‌పేట్ ఉన్న‌త పాఠ‌శాల‌కు చెందిన ఎన్‌సీసీ కేడెట్లు బి.చైత‌న్య‌, జె.శ్రీ‌జ‌, టి.సాయిన‌మిత‌లు ప‌ర్వ‌తారోహ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ‌క‌న‌బ‌ర్చి బంగారు ప‌త‌కాలు సాధించార‌ని జిల్లా ఎన్‌సీసీ స‌మ‌న్వ‌య‌క‌ర్త కె.శ్రీ‌నివాస్ తెలిపారు. వీరిని గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ప్ర‌శాంతి అభినందించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ కేడెట్లు ఇలాంటి శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని రాణించాల‌ని కోరారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతూ జాతీయ‌స్థాయి పోటీల్లో పాల్గొన‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. 12 రోజుల‌పాటు జ‌రిగిన శిక్ష‌ణా శిభిరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు చెందిన 268 మంది కేడెట్లు పాల్గొని వివిధ అంశాల్లో శిక్ష‌ణ పొందారు. కేడెట్ల‌ను పాఠ‌శాల హెచ్ ఎం టి.వాణి, ఉపాధ్యాయులు ఎం.ప‌ర‌మేశ్వ‌ర్‌, జె.ల‌క్ష్మ‌ణ్‌, టీచ‌ర్లు అభినందించారు. 

Popular News may like