Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి

- జిల్లా ఎస్పీ శ‌శిధ‌ర్‌రాజు

నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయములోని  సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ  సి.శశిధర్ రాజు  జిల్లా పోలీసులతో నెలవారీ  సమీక్ష  సమావేశాన్ని   నిర్వహించారు. ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  ఆన్ లైన్ వ్యవస్థ  ద్వారా జిల్లాలో నేరాలను నియంత్రిoచుటకు పూర్తిస్థాయిలో పోలీసు గస్తీ, పెట్రోలింగ్ బ్లూ కోడ్స్, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని  పేర్కొన్నారు, పోలీసు వ్వవస్థ ప్రజల రక్షణకై ముందుండలని తెలిపారు. నిర్మల్ జిల్లా పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ తెలంగాణా రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా ముందు ఉండాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం నేరాలు నియంత్రణలో ఉన్నాయని, ప్రజలకు పోలీసులపైన ఎంతో విశ్వాసం పెరిగిందన్నారు, ప్రజల మద్య ఉండే పోలీసుల పాత్రే కీలకంగా ఉంటుందని తెలిపారు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు రివార్డులు ఉంటాయన్నారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాణ౦ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

పరిసరాలను శుభ్రంగా  ఉంచాలని తెలిపారు, జిల్లాలో పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉంటుందని, ప్రజలకు అన్ని విధాల రక్షణ, భ‌ద్రత ఉంటుందని పేర్కొన్నారు. సి.సి. కెమెరాల ఏర్పాటులో "నేను సైతం /కమ్యూనిటీ సి సి కెమెరా" వంటి కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజల  భాగస్వాములుగా చేయ్యలన్నారు, నేరల నియంత్రణతో పాటు దర్యాప్తు చేధనకు దోహదపడే సి.సి. కెమెరా ల ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివిధ స్థాయి అధికారుల ప్రత్యేక చొరవతో పట్టణ కాలనీలలొ, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల‌ వంటి చోట ఏర్పాటు చేయాలనని తెలిపారు. సి సి  కెమెరా లు  రాబోయే ఎలక్షన్లకు కూడా ఉపయోగపడతాయని , అందుకు  ప్రతి  గ్రామంలో  సి సి  కెమెరాల‌ ఏర్పాటుకు  కృషి  చెయ్యాలని అధికారులకు  సూచించారు. అదేవిధంగా రాబోవు ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు  జరగకుండా నిర్వహించేందుకుగా నిర్మల్ జిల్లా పరిధిలో పకడ్బంది ప్రణాళికల‌ను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. రాబోవు ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం ప్రతి పోలీసు అధికారి పక్క ప్రణాళికతో  సిద్ధంగా వుండాలని, ఇందుకోసం సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించడంతో పాటు, ఎన్నికల సమయంలో గోడవలను సృష్టించే వ్యక్తులను గుర్తించాలని, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన  నేరస్థుల సమాచారాన్ని సేకరించి  వారిపై గట్టి నిఘా పెట్టాలి వారి కదలికలపై నిఘా పెట్టాలని. ముఖ్యంగా ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఏవరైనా పాల్పడితె వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి వుంటుందన్నారు.  ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ద‌క్షిణాముర్తి, డీఎస్పీలు ఉపేంద్ర రెడ్డి, రాజేష్ బల్లా, స్పెషల్ బ్రాంచ్ ( ప్రత్యెక విభాగం ) SBI యం.ఎ. కరీం, సి.ఐ.లు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ కుమార్, బి.శ్రీనివాస్, రమేష్ బాబు,ప్రవీన్ కుమార్,వి.శ్రీనివాస్ మరియు DCRB సి.ఐ.నరేష్ కుమార్,CCS CI శ్రీనివాస్ మరియు జిల్లా లోని ఎస్.ఐ లు పాల్గొన్నారు.

 

Popular News may like