Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
కూట‌మొ‌‌స్తే క‌రెంట్ కోత‌లే

- రాష్ట్ర ప్రజ‌లే న‌ష్ట‌పోతారు
- టీఆర్ఎస్‌ను గెలిపిస్తే గ‌ట్టిగా ప‌నిచేస్తాం
- ఒడితే ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటా
- ఇచ్చోడ‌,ఖానాపూర్,నిర్మ‌ల్‌,భైంసా స‌భ‌ల్లో సిఎం కేసీఆర్ వెల్ల‌డి

న‌ల‌భై ఏళ్ల‌లో చేయ‌లేని అభివృద్దిని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కేవ‌లం నాలుగేళ్ల‌లో చేసి చూపించింద‌ని,టీఆర్ఎస్‌ను గెలిపిస్తే గ‌ట్టిగా ప‌నిచేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌న్నింటికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తామ‌ని రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. గురువారం ఇచ్చోడ‌,ఖానాపూర్,భైంసా,నిర్మ‌ల్‌లో జ‌రిగిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో సిఎం కేసీఆర్‌ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. టీఆర్ఎస్ గెలిస్తే గ‌ట్టిగా ప‌నిచేస్తామ‌ని, ఒక‌వేళ ఓడితే ఇంట్లోనే కూర్చుని రెస్ట్ తీసుకుంటాన‌ని చెప్పారు. కాంగ్రెస్‌,టీడీపీ,ఇత‌ర పార్టీల కూట‌మి గెలిస్తే మాత్రం ప్ర‌జ‌లే న‌ష్ట‌పోతార‌ని,క‌రెంటు,నీటి కొర‌త లాంటి అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయ‌ని పేర్కొన్నారు. నిర్మల్ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి,జోగురామ‌న్న‌ల స‌హ‌కారంతోనే ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభ‌జించామ‌ని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం ఏర్పడిన త‌ర్వాత వ్య‌వ‌సాయానికి శ్రీ‌రాంప్రాజెక్టు, స్వ‌ర్ణ‌, దోనిగాం, స‌ద‌ర్‌మాట్‌ల ద్వారా పంట‌ల‌కు పుష్క‌లంగా నీరందించ‌గ‌లిగామ‌న్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే నిర్మ‌ల్‌, ముధోల్‌,ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌ల‌కు నీటి కొర‌త ఉండ‌ద‌ని తెలిపారు. రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంటు ఇవ్వ‌డం దేశ చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. దీంతో రైతులు ఉత్సాహంగా పంట‌లు పండించుకోగ‌లుగుతున్నార‌న్నారు.

మాట ఇచ్చిన ప్ర‌కారం నిర్మ‌ల్‌లో అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఆర్మూర్ టు నిర్మ‌ల్ రైల్వేలైన్‌కు కృషిచేస్తామ‌న్నారు. రాష్ట్రంలో నిశ్శ‌బ్ద విప్ల‌వం కాదు శ‌బ్ధ విప్ల‌వం ఉంద‌న్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మ‌ల్ క‌ల్చ‌రల్‌లో క‌వులు, క‌ళాకారులు, చైత‌న్య‌వంతుల‌కు నిల‌య‌మ‌న్నారు. కులం,మ‌తం అన్న బేదాలు లేకుండా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో ప‌రిణ‌తి రావాల‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు సంతోషంగా జీవించాల‌న్నారు. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 17,18 ఏల్ల‌లో వ‌చ్చిన కూట‌మితో అభివృద్ది ఏమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏమి జ‌రిగింది, ప్ర‌స్తుత నాల‌గేళ్ల‌ ప్ర‌భుత్వంలో ఏమి అభివృద్ది జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కే తెలుస‌న్నారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల కరెంటు ఇవ్వ‌డం తెలంగాణ రాష్ట్రానికి సాధ్య‌మైంద‌న్నారు. మాట ప్ర‌కారం ఆశావ‌ర్క‌ర్ల‌కు, అంగ‌న్‌వాడీల‌కు జీతాలు పెంచామ‌న్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఆరోగ్య‌ల‌క్ష్మీ, బాలింత‌ల‌కు కేసీ ఆర్ కిట్‌, ఆడ‌పిల్ల పుడితే 13వేలు, మ‌గ‌బిడ్డ పుడితే 12వేలు అంద‌జేసిన ఘ‌న‌త టీఆర్ఎస్‌కే ద‌క్కింద‌న్నారు. క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కం భార‌త‌దేశంలో మరే రాష్ట్రంలో లేద‌న్నారు. పిఎఫ్ ఉన్న మ‌హిళ‌లంద‌రికి భృతి చెల్లిస్తామ‌న్నారు. అన్ని ప‌థ‌కాల‌తో సంపూర్ణ తెలంగాణ ఏర్ప‌డుతుంద‌న్నారు. కంటి వెలుగు ప‌థ‌కంతో ఎంద‌రో మంది కంటి ప‌రీక్ష‌లు చేయించుకుని వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోగ‌లిగార‌న్నారు.

త్వ‌ర‌లో మీ గ్రామాల్లోకి ముక్కు,గొంతు,చెవి ప‌రీక్ష‌లు చేసే వైద్యులు కూడా వ‌స్తార‌న్నారు. ఎంఐఎం పార్టీ అధ్య‌క్షులు అస‌దుద్దిన్ ఓవైసీ మంచి మిత్రుడ‌ని అత‌నితో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌న్నారు. 58 ఏళ్ల కాంగ్రెస్‌,టీడీపీ పాల‌న ఎలా ఉండే, ప్ర‌స్తుత టీఆర్ఎస్ పాల‌న ఎలా ఉండేనే ప్ర‌జ‌లే తెలుస‌న్నారు. గోదావ‌రి, కృష్ణ పుష్క‌రాల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి,జోగురామ‌న్న‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించార‌న్నారు. 10 సంవ‌త్స‌రాల కాంగ్రెస్ పాల‌న‌లో 9 కోట్ల 56 ల‌క్ష‌లు ఉన్న సంద‌ప తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 257 కోట్ల సంప‌ద‌గా పెరిగింద‌న్నారు. రైతుబంధు, రైతుభీమా ప‌థ‌కంలో రైతుల‌కు ఎంతో మేలు జ‌రిగింద‌న్నారు. మ‌హిళా సంఘాల‌కు రుణాలు అంద‌జేసి వారికి ఫుడ్ ప్రాసేసింగ్ ద్వారా ఉపాధి క‌ల్పించి రేష‌న్ షాపుల ద్వారా క‌ల్తీలేని సరుకుల‌ను అంద‌జేస్తామ‌న్నారు. వారికి ఉపాధితోపాటు ఆదాయ సంప‌ద పెరుగుతుంద‌ని వివ‌రించారు. న‌రేంద్రమోడి పాల‌నతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌న్నారు. గిరిజ‌నుల‌, ముస్లిం మైనార్టీల రిజ‌ర్వేష‌న్ల‌కు ప్ర‌ధాని మోది స‌హ‌క‌రించ‌లేద‌న్నారు. కేసీఆర్ ప‌ట్టుబ‌డితే సాధించే వ‌ర‌కు వ‌ద‌ల‌డ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌,మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కంతో రైతుల‌కు ఎంతో మేలు జ‌రిగింద‌న్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాన్ని గ‌జ్వేల్ త‌ర‌హాలో అభివృద్ది చేస్తాన‌న్నారు. ప్ర‌జ‌లు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల‌ని సి ఎం కేసీ ఆర్ కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆదిలాబాద్ ఎంపీ గేడెం న‌గేష్‌, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల‌చారి,జ‌డ్పి చైర్‌ప‌ర్స‌న్ శోభారాణి, నాయ‌కులు స‌త్య‌నారాయ‌ణ‌గౌడ్‌, మ‌ల్లికార్జున్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Popular News may like