Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించండి

ప్రచారంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ సువర్ణ రెడ్డి

మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ స్వ‌ర్ణారెడ్డి రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజక వర్గంలో నిశ్శబ్ద విప్లవం ఉందని, బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని సోమవార్‌పేట్‌లో  `మార్పు కోసం బీజేపీ - గడప గడపకు స్వర్ణమ్మ` పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గొల్లపేట్‌ కాలనీకి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో కుంట శ్రీనివాస్ ఆద్వర్యంలో డాక్టర్ సువర్ణ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంటింటికి వెళ్లి ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను కరపత్రాలను అంద‌జేసి వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తుందని, ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాదని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, బడుగుల కాపాడే అనేక సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే బీజేపీ గెలవాలని అన్నారు.

అలాగే  నిర్మల్ మండలంలోని అనంతపేట్‌ గ్రామంలో బుధవారం రాత్రి గడప గడపకు స్వర్ణమ్మ పాదయాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను డాక్టర్ సువర్ణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇతర పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తే వారు మీ సమస్యలను పట్టించుకోలేదని ఈసారి వస్తే నిల‌దీయాల‌ని అన్నారు. ఇప్పటివరకు మీరు ఓట్లు వేసిన పార్టీలు మీ సమస్యలను పట్టించుకోలేదని ఈసారి జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు, యువత బ్రహ్మరథం పట్టారు.  రచ్చ మల్లేష్, అయ్యన్నగారి రాజేంధర్, మైనార్టీ నాయకులు బాబ, ఒడిసెల అర్జున్, తోట సత్యనారాయణ,  నిజాం, జహీర్, అయిండ్ల చిన్నారెడ్డి, కుంట  శ్రీనివాస్, దిలీప్, వస్త్రాల శివ ప్రసాద్, విశాల్ గౌడ్, కోటగిరి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, ఆడెపు సుధాకర్,  నాయకులు  రచ్చ మల్లేష్, అయ్యన్నగారి రాజేంధర్, హరివర్మ, సముంధర్‌పల్లి రమేష్‌, మైనార్టీ నాయకులు బాబ, ఒడిసెల అర్జున్, నిజాం, జహీర్, అయిండ్ల చిన్నారెడ్డి, దిలీప్, వస్త్రాల శివ ప్రసాద్, విశాల్ గౌడ్, కోటగిరి గోపి, శ్రీధర్‌, ఆనంద్‌, పంతికే రాము తదితరులు పాల్గొన్నారు.

Popular News may like