Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మీ క‌ష్టాల్లో నేనై ఉంటా

- బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డా.స్వ‌ర్ణారెడ్డి

మీ క‌ష్టాల్లో తోడుంటాన‌ని.. రాబోయే ఎన్నిక‌ల్లో మీ ఇంటి ఆడబిడ్డ‌గా ఆశీర్వ‌దించాల‌ని బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ స్వ‌ర్ణారెడ్డి అన్నారు. నిర్మ‌ల్‌లోని పార్టీ కార్యాల‌యంలో న‌ర్సాపూర్‌(జి) మండ‌లం రాంపూర్ గ్రామానికి చెందిన మ‌హిళ‌లు, దిలావ‌ర్‌పూర్ మండ‌ల వాసులు డాక్ట‌ర్ స్వ‌ర్ణారెడ్డి స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు. వారికి ఆమె పార్టీ కండువాలు క‌ప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా స్వ‌ర్ణ‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌ధాని నరేంద్ర‌మోడి చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను తెలుసుకుని బీజేపీ ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతూ పార్టీలో చేరుతున్నార‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు అందించండంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు.

నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది చేయ‌క‌పోవ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ఎస్ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నార‌ని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌తే బీజేపీని గెలిపిస్తుంద‌ని ఆమె ధీమా వ్య‌క్తంచేశారు. సిఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి ప్ర‌జ‌ల నుండి తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు. అభివృద్ది జ‌ర‌గాలంటే బీజేపీతోనే సాధ్య‌మ‌ని, క‌మ‌లం గుర్తుకే ఓటువేసి త‌న‌ను గెలిపిస్తే అందుబాటులో ఉండి అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర విత్త‌న ప‌రిశోధ‌న మండ‌లి స‌భ్యులు అయ్య‌న్న‌గారి భూమ‌య్య‌, బీజేపీ కృష్ణా, గోదావ‌రి జ‌లాల రాష్ట్ర క‌న్వీన‌ర్ రావుల రాంనాథ్‌, రాష్ట్ర ఉపాధ్య‌క్షులు ఒడిసెల శ్రీ‌నివాస్‌, నాయ‌కులు ర‌చ్చ మ‌ల్లేష్‌, రాచ‌కొండ సాగ‌ర్‌, రాజేంధ‌ర్‌, బాబు, ఒడిసెల అర్జున్‌, ద్యాగ శివ‌రాం, ఉద‌య్‌, గండ్ర‌త్ రాజేశ్వ‌ర్‌, చిన్నారెడ్డి, శ్రీ‌నివాస్‌రెడ్డి, న‌ర్సారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Popular News may like