Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
దీప‌కాంతుల వెలుగుల్లో దీపావ‌ళి

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ప్ర‌జ‌లు దీప‌కాంతుల వెలుగుల్లో దీపావ‌ళి పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించుకున్నారు. త‌మ ఇండ్ల‌ల్లో ల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టానికి ప్ర‌త్యేకంగా అలంక‌రించి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ట‌పాసుల‌ను కాల్చారు. త‌మ కుటుంబ స‌భ్యులు ఆనందోత్సాహాల‌తో, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వ‌ర్యాల‌తో ఉండాల‌ని మొక్కుకున్నారు. అలాగే మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి త‌న నివాసంలో కుటుంబ సభ్యుల‌తో క‌లిసి అమ్మ‌వారి విగ్ర‌హానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి దీపావ‌ళి పండుగను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. మ‌నుమ‌డు, మ‌నురాళితో క‌లిసి ట‌పాసుల‌ను కాల్చారు. ఈ సంద‌ర్భంగా  మంత్రి మాట్లాడుతూ ప్ర‌జ‌లంతా పిల్లాపాప‌లు సుఖ‌షాంతుల‌తో అష్ట ఐశ్వ‌ర్యాలు, ఆయురారోగ్యాలు సిద్దించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. దీపావ‌ళి పండుగ త‌న‌కెంతో ఇష్ట‌మ‌న్నారు. కుటుంబ స‌భ్యులంతా ఒకేచోటికి చేరి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఉత్సాహంగా పండుగ‌ను జ‌రుపుకుంటార‌న్నారు. 

Popular News may like