Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మ‌రింత అభివృద్ది చేస్తాం

- ఆప‌ద్ధ‌ర్మ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి
- టీఆర్ఎస్ పార్టీలో చేరిన యువ‌కులు, మ‌హిళ‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ది, సంక్షేమ ఫ‌లాలు ఇంటింటికి అందాయ‌ని, మ‌రింత అభివృద్దిని చేస్తామ‌ని టీఆర్ఎస్ పార్టీకి ఓటువేసి గెలిపించాల‌ని రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి అన్నారు. గురువారం మామ‌డ మండ‌లం అనంత‌పేట్ గ్రామానికి చెందిన 50 మంది ఇత‌ర పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప‌లు సంఘాల మ‌హిళ‌లు, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని రాంన‌గ‌ర్‌కు చెందిన గైక్వాడ్ కుల సంఘం స‌భ్యులు మంత్రి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  వారికి మంత్రి గులాభి కండువాలు క‌ప్పి టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కేసీ ఆర్ ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ఫ‌లాలను చూసే ఇత‌ర పార్టీల నుండి టీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లుగా వ‌స్తున్నార‌ని తెలిపారు. వృద్దుల‌కు ఆస‌రా పెన్ష‌న్‌లు, పేద ఆడ‌పిల్ల‌ల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్ కింద రూ. ఒక ల‌క్ష 116లు, మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ ద్వారా చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌తో రెండు పంట‌ల‌కు సాగునీరందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే తాగునీటికి ఇబ్బందులే ఉండ‌వ‌న్నారు. కాని గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరేవార‌ని, తీవ్ర‌మైన క‌రెంటు స‌మ‌స్య ఉండేద‌ని అన్నారు. దీంతో రైతులు అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని తెలిపారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో రైతుల‌కు 24 గంట‌ల పాటు నాణ్య‌మైన క‌రెంటును అంద‌జేశామ‌ని, ఎరువులు, విత్త‌నాల‌ను స‌కాలంలో అంద‌జేశామ‌ని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుభీమా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి విజ‌యవంతంగా కొన‌సాగించామ‌న్నారు. సీఎం కేసీ ఆర్ ఇంటింటికి అభివృద్ది సంక్షేమ ఫ‌లాలు అందేలా చూశార‌ని, దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపిస్తార‌ని మంత్రి ధీమా వ్య‌క్తంచేశారు. ఈ  కార్య‌క్ర‌మంలో ఎఫ్ఎసీఎస్ చైర్మెన్ రాంకిష‌న్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ రాజేంధ‌ర్‌, మాజీ మున్సిప‌ల్ చైర్మెన్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్‌, అయ్య‌న్న‌గారి రాజేంధ‌ర్‌, ఆకోజి కిష‌న్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Popular News may like