Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
మా మ‌ద్ద‌తు మీకే

- ప‌లు గ్రామాల ఓటర్లు
- మ‌హేశ్వ‌ర్‌రెడ్డికి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన గ్రామ‌స్థులు

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలోని  మామ‌డ మండ‌లంలో డీసీసీ అధ్య‌క్షులు ఏలేటి మ‌హేశ్వ‌ర్‌రెడ్డి బుధ‌వారం ప‌లు గ్రామాలు, తండాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. మండ‌లంలోని వాస్తాపూర్‌, రాంపూర్‌, పోచ‌మ్మ‌గూడ , బుర‌ద‌ప‌ల్లి, రాసిమెట్ల‌, తాండ్ర‌, ధంజినాయ‌క్ తాండ‌, సోంపేట్‌, మొండిగుట్ట‌, బూరుగుప‌ల్లి, గోండుగూడ‌, రాచ‌కోట‌లో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాల‌ని అభ్య‌ర్థించారు. అంత‌కుముందు గ్రామాల‌కు వ‌చ్చిన మ‌హేశ్వ‌రెడ్డికి మ‌హిళ‌లు మంగ‌ళ‌హార‌తుల‌తో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.  అలాగే గ్రామ‌స్థులు, యువ‌కులు బైక్ ర్యాలీ నిర్వ‌హించిన అనంత‌రం కాంగ్రెస్ జెండాలు ప‌ట్టుకుని ఇంటింటా ప్ర‌చారం చేశారు. ఇందులో భాగంగా గ్రామ‌స్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తామ‌ని మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ్రామ‌స్థుల‌తో మాట్లాడుతూ సిఎం కేసీ ఆర్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నిల‌బెట్టలేక ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌న్నారు. కేజీటుపీజి ఉచిత విద్య‌, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, పేద‌ల‌కు డ‌బుల్‌బెడ్రూమ్ ఇస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. కాని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ, రూ.1000 నుండి 2000 వ‌ర‌కు పెన్ష‌న్ల పెంపు, నిరుద్యోగ భృతి రూ.3000 అంద‌జేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇవేకాకుండా త‌మ మేనిఫెస్టోలో అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను రూపొందించ‌డం జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నార‌ని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీకి త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. ఆయా కార్య‌క్ర‌మాల్లో  బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షులు బాపురెడ్డి, పార్టీ మండ‌లాధ్యక్షులు రాజారెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అనుబంధ సంఘాల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

 

Popular News may like