Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
అభివృద్ది చూసే టీఆర్ఎస్‌లోకి

- మ‌హాకూట‌మి మాయ‌మాట‌లు న‌మ్మ‌వ‌ద్దు
- ఆప‌ద్ద‌ర్మ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ప్ర‌చారం,వ‌ల‌స‌లు జోరుగా కొన‌సాగుతుంది. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆప‌ద్ద‌ర్మ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని శేక్‌సాహెబ్‌పేట్‌, పాత మార్కెట్ ప్రాంతాల్లో ప్ర‌చారం చేస్తూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ కారు గుర్తుకు ఓటువేయాల‌ని అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా మంత్రికి మ‌హిళ‌లు మంగ‌ళ‌హార‌తుల‌తో రాగా స్థానికులు, యువ‌కులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చేరిక జోరు కొన‌సాగుతుంది. బీజేపీ పార్టీ నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లోకి వ‌ల‌స‌లుగా వ‌స్తున్నారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబ‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లికార్జున్‌రెడ్డి ఆద్వ‌ర్యంలో సుమారు 1500 మంది గులాభిగూటికి చేరారు. దివ్యాగార్డెన్‌లో ఏర్పాటుచేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన వారికి పార్టీ కండువాలు క‌ప్పి ఆహ్వానించారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాలు మాయ మాట‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, యువ‌త‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని తెలిపారు. అభివృద్ది కొన‌సాగాల‌న్న‌, ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు అందాల‌న్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌న్నారు. యువ‌త‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌తోపాటు స్వ‌యం ఉపాధి కోసం స‌బ్సీడీ రుణాలు అందిస్తున్నామ‌న్నారు. పార్టీలో చేరిన వారికి స‌ముచిత స్థానం ల‌భిస్తుంద‌ని తెలిపారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆక‌ర్షితులై టీఆర్ఎస్‌లో చేరుతున్నార‌న్నారు.  

అలాగే సోన్ మండ‌ల కేంద్రానికి చెందిన 300 మంది, నర్సాపూర్ మండ‌ల కేంద్రం నుండి సుమారు 300 మంది, నిర్మ‌ల్ మండ‌లం మంజులాపూర్ గ్రామానికి చెందిన 100 మంది, పట్టణంలోని గాంధీన‌గ‌ర్‌కు చెందిన సైండ్ల శ్రీ‌ధ‌ర్‌, మారుగొండ రాము ఆద్వ‌ర్యంలో 50 మంది, కుస్లి నుండి 50 మంది, సారంగాపూర్ మండ‌లం జామ్ గ్రామం నుండి 20 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు.  వారికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి గులాభి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాల‌య చైర్మెన్ ఎర్ర‌వోతు రాజేంధ‌ర్‌, మాజీ మున్సిప‌ల్ చైర్మెన్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్‌, ఎఫ్ఎసీఎస్ చైర్మెన్ రాంకిష‌న్‌రెడ్డి, బీజేవై ఎం మాజీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ముర‌ళీ, స‌తీష్‌, మైస శేఖ‌ర్‌,లింగ‌న్న‌,  టీఆర్ఎస్ నేతలు ముడుసు స‌త్య‌నారాయ‌ణ‌, డా.సుభాష్‌రావు, కౌన్సిల‌ర్లు అయ్య‌న్న‌గారి రాజేంధ‌ర్‌, అజింబిన్‌యాహ్య‌, ర‌ఫి ఖురేషి, బ‌షీర్‌ఖాన్‌, స‌య్య‌ద్ ఇలియాస్ అలీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.  

Popular News may like