Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
స్టాక్స్, మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డులు లాభమేనా..?

స్టాక్ మార్కెట్ గురించి అవ‌గాహన లేని వారు మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్తమ మార్గం. తర్వాత ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా మార్కెట్ అవ‌గాహన పెంచుకోవ‌చ్చు. ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ త‌ప్ప‌నిస‌రి. డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేయ‌డం కోసం మార్కెట్లో బ్రోక‌రేజి సంస్థ‌లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో లాభాల‌ను ఒడిసిప‌ట్టుకోవాలంటే స్టాక్స్ ఎంపిక‌నే ప్ర‌ధానం. స్టాక్స్ ఎప్పుడు ప్రైజ్ ఆధారంగా ఎంపిక చేసుకోకూడ‌దు. మెసేజ్ రూపంలో వ‌చ్చే స్టాక్స్ న‌మ్మ‌కూడ‌దు. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా లాభాల‌ను ఆర్జించ‌వ‌చ్చు. అయితే ఈక్విటీల్లో లాభాలు ఆర్జించాలంటే దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు ఉత్త‌మం. ఏ స్టాక్స్ అయితే దీర్ఘ‌కాలంలో మ‌ల్టీబ్యాగ‌ర్ స్టాక్స్ గా మారుతాయో అంచ‌నా వేసి అలాంటి స్టాక్స్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ కంపెనీ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాకే పెట్టుబ‌డి పెట్టాలి. మార్కెట్ పై అవ‌గాహన లేకుండా డేరివేటివ్ మార్కెట్, క‌మోడిటీ మార్కెట్ ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌కూడ‌దు.


మ్యూచువ‌ల్ ఫండ్స్ లో ఎంపిక ఎలా..
దీర్ఘ‌కాలిక అవ‌స‌రాల‌ను, పిల్లల భ‌విష్య‌త్తు దృష్టిలో ఉంచుకొని మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డి పెట్ట‌డ‌మే మేలు. దీని వ‌ల్ల ఎక్కువ లాభాలు పొంద‌వ‌చ్చు. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్ రేట్లు అంత ఆక‌ర్ష‌ణీయంగా లేవ‌నే చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యామ్న‌యంగా ఎక్కువ మంది మ్యూచువ‌ల్ ఫండ్స్ లపైనే దృష్టి సారిస్తున్నారు. మ్యూచువ‌ల్ ఫండ్స్ లో పెట్టుబ‌డి పెట్టాలంటే మొద‌టిసారి CAMS నుండి  KYC క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే మ్యూచువ‌ల్ ఫండ్స్ లో రెండు ర‌కాల పెట్టుబ‌డులు ఉంటాయి. మొద‌టిది లంప్స‌మ్ అంటే ఒకేసారి పెట్టుబ‌డి పెట్ట‌డం. ఇందులో తక్కువ‌లో త‌క్కువ‌గా 5 వేల, ప‌ది వేల నుంచి ఎంతైనా పెట్ట‌వ‌చ్చు. ఇక రెండోది SIP అంటే సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. ఇందులో త‌క్కువ‌లో త‌క్కువ‌గా 500,1000ల నుంచి ఎంతైనా ఎంచుకోవ‌చ్చు. SIP రూపంలో పెట్టుబ‌డి ఉత్త‌మైన మార్గంగా చెప్పుకోవ‌చ్చు. అంతేకాకుండా దీని ద్వార మార్కెట్ ఒడిదొడుకుల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్స్ ను అందించ‌డానికి మార్కెట్లో కొటాక్‌, రిలియ‌న్స్, ఐసీఐసీఐ వంటి చాలా ర‌కాల సంస్థ‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే మ్యూచువ‌ల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్‌, లార్జ్ క్యాప్‌, మ‌ల్టీ క్యాప్‌, ట్యాక్స్ బెన్ఫిట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. మ్యూచువ‌ల్ ఫండ్స్ లో ఫండ్ ఎంపిక అనేది చాలా కీల‌కం. వీటిలో లాభాలు మార్కెట్ రిస్క్ కు లోబ‌డి ఉంటాయి. మరోవైపు మ్యూచువ‌ల్ ఫండ్స్ లో ట్యాక్స్ బెన్ఫిట్ కోసం 80(C) of IT ACT 1961 ప్ర‌కారం చూప‌డానికి ELSS స్కీమ్స్ ఉన్నాయి. ఇది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ట్యాక్స్ క‌ట్టే వారికి ట్యాక్స్ బెన్ఫిట్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది.  

DUBBA PRAVEEN (MBA)

B.N. Rathi securities,

NIRMAL Branch Manager

Beside HERO show Room,

MNCL Road, Nirmal 

(Association of Mutual Funds in India

registered mutual funds distributer

ARN Code 137322)

phone: 9908374375, 8919105718
 

Popular News may like