Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
వ‌డ్యాల్‌లో సినిమా షూటింగ్ సంద‌డి

ల‌క్ష్మ‌ణచాంద మండ‌లంలోని వ‌డ్యాల్ గ్రామం సినిమా షూటింగ్‌తో సంద‌డిగా మారింది. కొన్ని రోజులుగా గ్రామంలోని ప‌లు చోట్ల సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. హీరో అల్ల‌రి న‌రేష్, సునీల్ న‌టిస్తున్న సినిమాకు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను వ‌డ్యాల్ గ్రామంలో, శివారు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి ఇక్క‌డ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌టంతో గ్రామంలో సంద‌డి వాతావ‌ర‌ణం క‌న్పిస్తోంది. ముఖ్యంగా హీరోల‌ను, చిత్రీక‌ర‌ణ‌ను చూసేందుకు గ్రామ ప్ర‌జ‌ల‌తో పాటు చుట్టు ప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు కూడా వ‌స్తున్నారు. శనివారం గ్రామ శివారులో ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. షూటింగ్ చూసేందుకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ‌చ్చారు. అంత‌కుముందు జ‌రిగిన షూటింగ్‌లో యాంక‌ర్ ఝాన్సీ, స‌న్నీ, ఆటో రాంప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. భీమినేని శ్రీనివాస్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో తీసిన‌ సుడిగాడు సినిమాకు ఇది సీక్వెల్ అని చెప్పుకుంటున్నారంతా. 
 
 

Popular News may like