Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       
టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్

- 8792 టీచ‌ర్ పోస్టుల‌కు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌

- ఈ నెల 30 నుంచి నవంబ‌ర్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను టీఎస్‌పీఎస్సీ శనివారం సాయంత్రం విడుదల చేసింది. టీఆర్‌టీ ద్వారా 8,792 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మొత్తం ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 8వేల 792 ఉపాద్యాయ‌ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి. 31 జిల్లాల ప్రాతిపదికన టీచర్ రిక్రూట్ మెంట్ టెస్టు పేరుతో ఐదు నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. వీటికి  అక్టోబర్ 30 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 2018 ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. టీఆర్‌టీకి మొత్తం నాలుగు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

పోస్టుల వివ‌రాలుః

స్కూల్‌ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు (వ్యాయామ విద్య) 9, భాషా పండితులు 1011, ఎస్‌జీటీ 5,415 పోస్టుల చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితుల పోస్టులకు టెట్‌ 20శాతం వెయిటేజీ కల్పించనున్నారు. మ‌న జిల్లాకు 226 పోస్టులు కేటాయించ‌గా మిగ‌తా జిల్లాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 293, మంచిర్యాల 169, కొమురం భీం ఆసిఫాబాద్ 894, కరీంనగర్ – 71, జగిత్యాల – 253, పెద్దపల్లి – 53, రాజన్న సిరిసిల్ల – 76, నిజామాబాద్ – 158, కామారెడ్డి – 381, వరంగల్ అర్బన్ – 22, వరంగల్ రూరల్ – 23, జయశంకర్ భూపాలపల్లి – 319, జనగాం – 60, మహబూబాబాద్ – 128, ఖమ్మం – 57, భద్రాద్రి కొత్తగూడెం – 185, మెదక్ – 281, సంగారెడ్డి – 903, సిద్దిపేట – 101, మహబూబ్ నగర్ – 731, వనపర్తి – 154, నాగర్ కర్నూల్ – 385, జోగులాంబ గద్వాల్ – 438, నల్లగొండ – 190, సూర్యపేట – 156.  

Popular News may like