Latest News
మననిర్మల్.కామ్ mananirmal.comకు స్వాగతం. నిర్మల్ జిల్లా వార్తలను నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మీకందించే వెబ్‌సైట్ mananirmal.com       


హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు ఉన్నట్లే నిర్మల్‌కు కూడా 400 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. అరణ్యాన్ని చదునుచేసి.. నివాసయోగ్యంగా మార్చి.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నిమ్మలనాయుడు మొదలుకుని.. నేటి వరకు ఈ ప్రాంతంలో నిర్మల్ గొప్పదనం మాత్రం తగ్గలేదు.


స్వాతంత్ర్య పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పునర్మిర్మాణం కోసం జరిగిన ఎన్నో ఉద్యమాలకు నిర్మల్ కేంద్ర బిందువు. రాజకీయంగా, విద్యారంగంలో జిల్లా కేంద్రంగా ఉన్న మన నిర్మల్ పారిశ్రామిక, ఉపాధి కల్పన రంగాల్లో మరింత పురోగతి సాధించే సత్తా ఉన్నా వివిధ కారణాల వల్ల వెనకబాటుకు గురైంది.


నిర్మల్ పౌరులుగా గతంలో జరిగిన పోరపాట్లను మదిలో ఉంచుకుని అందరినీ కలుపుకుపోయి నిర్మల్ పునర్మిర్మాణానికి పునాదులు వేయటమే మననిర్మల్.కామ్ లక్ష్యం. ఈ ఉద్యమంలో నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరినీ భాగస్వాములను చేసే దిశగా వారిని చైతన్యవంతులుగా మార్చేందుకు కళా, సంస్కృతి, విద్యా రంగాలతో పాటు వివిధ రంగాల్లోని మేధావులను కలుపుపోతాం.

తాజా వార్తలు